logo

108 అంబులెన్సుల్లో ప్రసవాలు

మండలంలోని వేర్వేరు గ్రామాల్లో ఇద్దరు గర్భిణులు 108 వాహనాల్లోనే ప్రసవించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మారేడుమిల్లి మండలం తాడేపల్లి పంచాయతీ పరిధిలోని మద్దివీడు గ్రామానికి చెందిన బి.సన్యాసమ్మకు నెలలు నిండటంతో పురిటి నొప్పులు మొదలయ్యాయి.

Published : 28 Apr 2024 01:51 IST

సన్యాసమ్మ బిడ్డను బంధువులకు అప్పగిస్తున్న ఈఎంటీ వెంకటేశ్‌

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మండలంలోని వేర్వేరు గ్రామాల్లో ఇద్దరు గర్భిణులు 108 వాహనాల్లోనే ప్రసవించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మారేడుమిల్లి మండలం తాడేపల్లి పంచాయతీ పరిధిలోని మద్దివీడు గ్రామానికి చెందిన బి.సన్యాసమ్మకు నెలలు నిండటంతో పురిటి నొప్పులు మొదలయ్యాయి. బంధువులు 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. మారేడుమిల్లి అంబులెన్సు సిబ్బంది ఈమెను రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు అధికమయ్యాయి. గత్యంతరం లేక అంబులెన్సును రహదారి పక్కనే నిలిపేసి ప్రసవం చేశారు. ఈమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు. మండలంలోని చావడికోట పంచాయతీ పరిధి తేనెలమామిడి గ్రామానికి చెందిన సాదల రాజకుమారిని 108 అంబులెన్సు సిబ్బంది మారేడుమిల్లి ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా నొప్పులు అధికమయ్యాయి. వాహనంలోనే ఆమె కూడా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.అనంతరం తల్లీబిడ్డలను బోదులూరు పీహెచ్‌సీలో చేర్చారు. రెండుసార్లు అప్రమత్తంగా వ్యవహరించిన ఈఎంటీ వెంకటేశ్‌, పైలెట్ నగేశ్‌లను అంతా అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు