logo

యువత చొరవతో మూగజీవికి ఊరట

మురుగు ట్యాంకులో పడిపోయిన ఆవును యువకులు బయటకు తీసి, సపర్యలు చేయడంతో ప్రాణాలతో బయటపడింది.

Published : 28 Apr 2024 01:54 IST

ట్యాంకులో పడిన ఆవును పరిశీలిస్తున్న యువకులు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మురుగు ట్యాంకులో పడిపోయిన ఆవును యువకులు బయటకు తీసి, సపర్యలు చేయడంతో ప్రాణాలతో బయటపడింది. మారేడుమిల్లిలో శనివారం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మారేడుమిల్లిలోని అద్దరవీధికి చెందిన పరమయ్యకు చెందిన ఆవు మేత కోసం తిరుగుతూ స్థానిక వినాయక ఆలయం సమీపంలోని ఒక ఇంటి వద్ద ఏర్పాటు చేసుకున్న మురుగు నీటి ట్యాంకులో ప్రమాదవశాత్తూ పడిపోయింది. చాలాసేపటి వరకు దీన్ని ఎవరూ గమనించక పోవడం, ట్యాంకు చాలా ఇరుకుగా ఉండటంతో ఆవు నరకయాతన అనుభవించింది. స్థానికులు గమనించడంతో మారేడుమిల్లి యువజన సంఘం అధ్యక్షుడు నల్లమిల్లి సుబ్బారెడ్డి చొరవతో యువకులు స్పందించారు. తాళ్ల సహాయంతో శ్రమించి ఆవును బయటకు తీశారు. అయితే అప్పటికే సొమ్మసిల్లిపోయిన ఆవుకు సపర్యలు చేయడంతో కొంతసేపటికి తేరుకుని లేచి వెళ్లిపోయింది. కంబం సంజయ్‌, దాసరి సమ్మీ, వరకవి సాయి, ఆడారి గంగ గణేశ్‌, గొర్లె హర్షవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

బయటకు తీశాక సపర్యలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని