logo

నిర్మాణాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం..

గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి. ఆ కోవకు చెందిందే మోతుగూడెం పంచాయతీ అతిథి గృహ భవన నిర్మాణం.

Published : 29 Apr 2024 01:31 IST

మోతుగూడెం, న్యూస్‌టుడే 

గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి. ఆ కోవకు చెందిందే మోతుగూడెం పంచాయతీ అతిథి గృహ భవన నిర్మాణం. తెదేపా హయాంలో రూ.అయిదు లక్షల పంచాయతీ నిధులతో ఈ భవన నిర్మాణ పనులు చేపట్టారు. ఇది పూర్తయితే జిల్లా, డివిజన్‌ కేంద్రాల నుంచి వచ్చే ఉన్నతాధికారులు బస చేయటానికి ఉపయోగపడటమే కాకుండా, మోతుగూడెం పర్యటక ప్రాంతాల సందర్శనకు వచ్చే వారికి అద్దెకు గదులు కేటాయిస్తే, పంచాయతీకి ఆదాయం సమకూరుతుందని భావించారు. శ్లాబు వేశాక నిధులు సరిపోకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం దానిని పట్టించుకోకపోవడంతో  అసంపూర్తిగా ఉండిపోయింది. ఈ అసంపూర్తి భవనం పశువులకు నిలయంగా మారింది. ఓ గదిలో మతిస్థిమితం లేని మహిళ ఉంటుంది. ఈ భవనాన్ని ఇలాగే వదిలేస్తే భవనం శిథిలావస్థకు చేరి ప్రభుత్వ ధనం వృథా అవుతుంది. అధికారులు స్పందించి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

అలా వదిలేశారు..

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: మన్యంలోని చాలా గ్రామాల్లో సచివాలయాల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పలుచోట్ల పనులు పూర్తయినా ప్రారంభించలేదు. సచివాలయ వ్యవస్థ ప్రారంభించి నాలుగు ఏళ్లు గడుస్తున్నా భవనాలు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. అద్దె భవనాల్లో కార్యాలయాలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. అనంతగిరి మండలంలోని బీంపోలు పంచాయతీ కేంద్రంలో సచివాలయ భవనం ప్రారంభానికి నోచుకోలేదు. అధికారులు చర్యలు తీసుకుని దీన్ని అందుబాలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

మోతుగూడెంలో అసంపూర్తిగా అతిథి గృహం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని