logo

మాతా శిశు మరణాలు నమోదైతే చర్యలు: డీఎంవో

ప్రజల చెంతకు వైద్యారోగ్యశాఖ పథకాలను సమర్థంగా తీసుకువెళ్లాలని జిల్లా మలేరియా అధికారి(డీఎంవో) రామారావు సూచించారు.

Published : 25 Mar 2023 04:14 IST

వైద్యారోగ్యశాఖ పథకాలపై సమీక్షిస్తున్న మలేరియా అధికారి

పెడన, న్యూస్‌టుడే: ప్రజల చెంతకు వైద్యారోగ్యశాఖ పథకాలను సమర్థంగా తీసుకువెళ్లాలని జిల్లా మలేరియా అధికారి(డీఎంవో) రామారావు సూచించారు.మండలంలోని చేవేండ్రపాలెం పీహెచ్‌సీలో వైద్యారోగ్యశాఖ పథకాలపై శుక్రవారం ఆయన వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంవో మాట్లాడుతూ మాతా శిశు మరణాలను పూర్తిగా నియంత్రించాలన్న లక్ష్యంగా ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తోందని ఎక్కడైనా ఈ తరహా మరణాలు నమోదైతే శాఖాపరమైన చర్యలుంటాయని స్పష్టం చేశారు. జాతీయ టీకాల కార్యక్రమం అమలు తీరును సమీక్షించారు. తెలంగాణాలో మీజిల్స్‌ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో చిన్నారులకు ఈటీకాలను షెడ్యూల్‌ ప్రకారం ఇవ్వాలని ఆదేశించారు. ఎంఎల్‌హెచ్‌పీల విధులపై సమీక్షిస్తూ వీరు  తమ కేంద్రాల్లో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలేదనే ఆరోపణలు వస్తున్నాయని కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. చేవేండ్రపాలెం పీహెచ్‌సీలో ప్రసవాలు చేయాలని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ప్రారంభించాలని వైద్యాధికారులకు సూచించారు. వైద్యాధికారులు డా.వరప్రసాద్‌బాబు డా.ప్రదీప్‌కుమార్‌, ఎంపీహెచ్‌ఈవో ఉమామహేశ్వరరావు, సూపర్‌వైజర్‌ సీహెచ్‌వీఎల్‌ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని