logo

Krishna Dist: గాల్లో తేలి.. గుండె జారి..

గుంతలమయమైన రహదారులు, కనీస మరమ్మతులకు నోచుకోని వంతెనల అనుసంధాన మార్గాల కారణంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ-కోడూరు రహదారిపై గుంతల్ని తప్పించబోయి ఇటీవల పాఠశాల బస్సు, తర్వాత కారు పంట కాల్వలోకి పల్టీ కొట్టగా ఇంకో సంఘటనలో 108 అంబులెన్స్‌ కూరుకుపోయిన సంగతి తెలిసిందే.

Published : 30 Dec 2023 08:53 IST

కోడూరు (అవనిగడ్డ), న్యూస్‌టుడే: గుంతలమయమైన రహదారులు, కనీస మరమ్మతులకు నోచుకోని వంతెనల అనుసంధాన మార్గాల కారణంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ-కోడూరు రహదారిపై గుంతల్ని తప్పించబోయి ఇటీవల పాఠశాల బస్సు, తర్వాత కారు పంట కాల్వలోకి పల్టీ కొట్టగా ఇంకో సంఘటనలో 108 అంబులెన్స్‌ కూరుకుపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మచిలీపట్నం మండలం భవానీపురం వైపు నుంచి కోడూరు మండలం ఉల్లిపాలెం వైపు రొయ్యల లోడుతో వస్తున్న ఆటో డ్రైవర్‌తోసహా ఉల్లిపాలెం-భవానీపురం వారధి వద్ద కుంగిపోయిన అనుసంధాన రహదారిపై పూర్తిగా పైకిలేచిపోయింది. ఆ సమయంలో అక్కడున్నవారంతా పక్కకు పడిపోకుండా ఆటోను పట్టుకోవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. అప్పటికే ఆటోలో ఉన్న ట్రేలన్నీ కిందకి జారిపోయి రొయ్యలు రోడ్డుమీద పడ్డాయి. వంతెనల వద్ద అనుసంధాన రహదారుల్ని పటిష్టపరచి గుంతల్ని పూడ్పించాలని ప్రజలు ముఖ్యంగా వాహన చోదకులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని