logo

గెలుపు వాకిట పసుపు తోరణం

ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు మయం.. తెలుపు, కాషాయం జెండాలతో రంగుల హరివిల్లు..! నినాదాలతో హోరెత్తిన నియోజకవర్గాలు.. జై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, మోదీ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు.

Updated : 23 Apr 2024 06:54 IST

నామినేషన్లకు పోటెత్తిన జనం
కూటమి శ్రేణుల్లో కదనోత్సాహం

మైలవరంలో వసంత, నేతలు

ఈనాడు, అమరావతి- న్యూస్‌టుడే, అవనిగడ్డ: ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు మయం.. తెలుపు, కాషాయం జెండాలతో రంగుల హరివిల్లు..! నినాదాలతో హోరెత్తిన నియోజకవర్గాలు.. జై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, మోదీ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం. విజయోత్సవ ర్యాలీల తరహాలో మేళతాళాలు.. డప్పు వాయిద్యాలు.. ఆనందోత్సాహాల మధ్య కూటమి అభ్యర్థుల నామినేషన్లు జోరుగా సాగాయి. రహదారులు జనసంద్రంగా మారాయి. దివిసీమ సైతం జనజాతరను తలపించింది.

  • విజయవాడ నగరంలో తెదేపా అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ నామినేషన్‌ ఆడంబరంగా జరిగింది. అక్షక్‌నగర్‌ నుంచి సబ్‌కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు కదం తొక్కాయి.
  • నందిగామలో తెదేపా అభ్యర్థిని తంగిరాల సౌమ్య నామినేషన్‌ వేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎంపీ అభ్యర్థి చిన్ని ర్యాలీలో పాల్గొన్నారు.
  • మైలవరంలో తెదేపా కార్యకర్తలు కదం తొక్కారు. ఐతవరంలో వసంత కృష్ణప్రసాద్‌ నివాసం నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా మైలవరం వరకు తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి చిన్ని, దేవినేని ఉమా ఉత్సాహంగా పాల్గొనడంతో తెదేపా కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తిరువూరులో వేల మంది తరలిరాగా.. తిరువూరు బైపాస్‌ సెంటర్‌ జనసంద్రంగా మారింది. అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఉత్సాహంగా పాల్గొన్నారు.
  • అవనిగడ్డలో జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ భారీ జనసందోహం మధ్య నామినేషన్‌ కార్యక్రమానికి తరలివెళ్లారు. జై పవన్‌ నినాదాలు మిన్నంటాయి.
  • పెడన తెదేపా అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్‌ ర్యాలీగా సాగి నామినేషన్‌ వేశారు.

విజయవాడ తూర్పులో..

నందిగామలో సౌమ్య...


అభివాదం చేస్తున్న బుద్ధప్రసాద్‌. పక్కన ఎంపీ బాలశౌరి, మాజీ ఎంపీ కొనకళ్ల తదితరులు

అవనిగడ్డ: శిరిడీ సాయి మందిరం నుంచి ర్యాలీగా వెళ్తున్న జనసేన, తెదేపా, భాజపా శ్రేణులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని