logo

విద్యుదాఘాతంతో ఒకరు మృతి

మండలంలోని మడక గ్రామంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శొంఠి హరికృష్ణ(36) శుక్రవారం రాత్రి విద్యుత్తు పరికరంతో ట్రాక్టర్‌ మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

Published : 28 Apr 2024 03:16 IST

పెడన, న్యూస్‌టుడే: మండలంలోని మడక గ్రామంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శొంఠి హరికృష్ణ(36) శుక్రవారం రాత్రి విద్యుత్తు పరికరంతో ట్రాక్టర్‌ మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అతడిని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు ఎస్సై సూర్యశ్రీనివాస్‌ చెప్పారు.శనివారం పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు  మృతదేహాన్ని అప్పగించారు. హరికృష్ణకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.


బాలిక అదృశ్యం

పెడన, న్యూస్‌టుడే: మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(14) అదృశ్యమైనట్లు స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తమ కుమార్తె శుక్రవారం నుంచి కన్పించడం లేదని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సూర్యశ్రీనివాస్‌ చెప్పారు. బాలిక అదృశ్యం వెనుక ముచ్చు నాగబాబు(28) పాత్ర ఉందని అనుమానంపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని