logo

వైకాపా మాటలు నమ్మి మోసపోవద్దు : వర్ల

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆయన మాటలు నమ్మి మరోసారి ఎవరూ మోసపోవద్దని తెదేపా కూటమి అభ్యర్థి వర్ల కుమార్‌రాజా అన్నారు.

Published : 29 Apr 2024 04:45 IST

దోసపాడు(పామర్రుగ్రామీణం), న్యూస్‌టుడే: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆయన మాటలు నమ్మి మరోసారి ఎవరూ మోసపోవద్దని తెదేపా కూటమి అభ్యర్థి వర్ల కుమార్‌రాజా అన్నారు. ఆదివారం ఆయన జమీదింటకుర్రు, వానపాముల, కొర్నిపాడు, రావులపాడు, పాములపాడు, దోసపాడు, తమలంపాడు, నాగపురం, సోమవరప్పాడు, మోపర్రు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల తెదేపా నాయకులు, కార్యకర్తలు డప్పు వాయిద్యాలతో వర్లకు ఘన స్వాగతం పలికారు. జనసేన నియోజకవర్గ బాధ్యుడు తాడిశెట్టి నరేష్‌, పార్టీ మండల అధ్యక్షుడు చలసాని రమేష్‌ చౌదరి, మండల కార్యదర్శి మసిముక్కు రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు సూరపనేని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


అలీనఖీపాలెం(పమిడిముక్కల), న్యూస్‌టుడే: వర్ల కుమారరాజాను గెలిపించాలని కోరుతూ... ఆదివారం వర్ల సతీమణి విశ్రమ అలీనఖీపాలెంలోను, వర్ల సోదరుడు చైతన్య ఫతేలంకలోను ప్రచారం చేశారు. అలీనఖీపాలెంలో మీర్జా అబ్బాస్‌, మక్బుల్‌, అలీమ్‌, ఫతేలంకలో ఫరీక్‌, షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.


పామర్రు, న్యూస్‌టుడే: తెదేపా కూటమి అభ్యర్థులకు ఎమ్మార్పీఎస్‌ మద్దతు ఉంటుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ అన్నారు. ఆదివారం స్థానిక చాట్లవానిపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. తెదేపా కూటమి నియోజకవర్గ అభ్యర్థి వర్ల కుమార్‌రాజా, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి విజయానికి మాదిగలందరూ కృషి చేయాలన్నారు.


పామర్రు, న్యూస్‌టుడే: ఎన్నికల్లో తెదేపా కూటమి అభ్యర్థులను గెలిపించాలని జనసేన మండల అధ్యక్షుడు గుంప గంగాధర్‌, తెదేపా టౌన్‌ అధ్యక్షుడు పరసా సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. ఆదివారం రామాంజనేయకాలనీ, నాగులేరు కాలువ గట్టులో మన ఇంటికి మన వర్ల కుటుంబం కార్యక్రమం నిర్వహించారు.


తోట్లవల్లూరు, న్యూస్‌టుడే: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి చెందుతుందని బీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి అన్నారు. ఆదివారం తోట్లవల్లూరులో తెదేపా నాయకులు సూపర్‌-6 పథకాలను స్థానికులకు వివరించి, కరపత్రాలు పంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని