logo

భారీగా బంగారం.. వెండి పట్టివేత

సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా బంగారం, వెండి దొరికిన సంఘటన కంచికచర్ల మండలం పేరకలపాడు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.

Published : 29 Apr 2024 05:17 IST

కంచికచర్ల, న్యూస్‌టుడే : సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా బంగారం, వెండి దొరికిన సంఘటన కంచికచర్ల మండలం పేరకలపాడు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై సుబ్రహ్మణ్యం వివరాల ప్రకారం... 65వ నంబరు జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తుండగా, హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బీవీసీ కంపెనీకి చెందిన లాజిస్టిక్స్‌ వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో బంగారు, వెండి ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి ఆదాయపు పన్ను, జీఎస్టీ అధికారులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దొరికిన బంగారం, వెండి ఆభరణాలు 66 కేజీలని, వాటి విలువ సుమారు రూ.14 కోట్లు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. ఆభరణాలు విజయవాడలోని ప్రముఖ బంగారు దుకాణానికి తీసుకెళ్తున్నట్లు సమాచారం. అందులో బంగారం ఎంత? వెండి ఎంత అని తెలుసుకునేందుకు కొలతలు వేస్తున్నారు. తరువాత ఖజానా అధికారులకు అప్పగిస్తామని ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని