logo

6న అవనిగడ్డకు పవన్‌ కల్యాణ్‌

ఎంపీ వల్లభనేని బాలశౌరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి ఆదివారం వేకనూరు వంతెన కూడలిలోని అభయాంజనేయస్వామిని దర్శించుకొని పూజలు చేశారు.

Published : 29 Apr 2024 05:19 IST

అవనిగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: ఎంపీ వల్లభనేని బాలశౌరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి ఆదివారం వేకనూరు వంతెన కూడలిలోని అభయాంజనేయస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే నెల 6న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అవనిగడ్డ పర్యటనకు వస్తారని.. ఆయనతో పాటు తెదేపా అధినేత చంద్రబాబు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు.


వైకాపాకు భారీ షాక్‌

అవనిగడ్డ, చల్లపల్లి న్యూస్‌టుడే: వైకాపాకు నియోజకవర్గంలో షాక్‌ మీద షాక్‌లు తగులుతున్నాయి. మాజీ ఎంపీ, ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య సమీప బందువు వక్కపట్లవారిపాలెం గ్రామ సర్పంచి అంబటి శ్యామ్‌ప్రసాద్‌ ఆదివారం స్థానిక జనసేన కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, మండలి బుద్ధప్రసాద్‌ల సమక్షంలో జనసేనలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని