logo

పెద్దారెడ్డి నామినేషన్‌.. అంతా పరేషాన్‌

తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్‌ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్‌ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Published : 25 Apr 2024 05:15 IST

యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన

ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌, విభాగినిపై కూర్చొని మందు తాగుతున్న వైకాపా కార్యకర్తలు

తాడిపత్రి, న్యూస్‌టుడే : తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్‌ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్‌ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు 3గంటల పాటు ర్యాలీ సాగింది. ఒకవైపు యల్లనూరు రోడ్డు కూడలి, మరో వైపు పశువైద్య శాల వద్ద రహదారులు బ్లాక్‌ చేశారు. ఆ సమయంలో అంబులెన్స్‌ రావడంతో ఇరవై నిమిషాల పాటు ముందుకు వెళ్లడానికి వీలులేని పరిస్థితి ఎదురైంది. వీరిని తప్పించుకుని వీధి దారుల్లో వెళ్దామనుకుంటే అక్కడా ట్రాఫిక్‌ కష్టాలే ఎదురయ్యాయి. ర్యాలీలో వైకాపా కార్యకర్తలకు మద్యం సరఫరా చేశారు. వారంతా బహిరంగంగానే రోడ్డు పక్కన విభాగినులపై కూర్చొని మద్యం తాగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని