logo

వైకాపాను సాగనంపుదాం

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం పట్టణంలోని 28వ వార్డులో, బొమ్మనహాళ్‌ మండలంలోని బొల్లనగుడ్డం, కల్‌హోళ, తారకాపురం, కల్లుదేవనహళ్లి గ్రామాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 28 Apr 2024 03:51 IST

28వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్న కాలవ శ్రీనివాసులు నాయకులు, కార్యకర్తలు

రాయదుర్గం, బొమ్మనహాళ్‌, న్యూస్‌టుడే: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం పట్టణంలోని 28వ వార్డులో, బొమ్మనహాళ్‌ మండలంలోని బొల్లనగుడ్డం, కల్‌హోళ, తారకాపురం, కల్లుదేవనహళ్లి గ్రామాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాయదుర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పట్టణంలోని 8, 27వ వార్డులో కాలవ విజయలక్ష్మి ఇంటింటి ప్రచారం జరిపి తన భర్త కాలవ శ్రీనివాసులును గెలిపించాలని కోరారు.

ఇంటింటా ప్రచారం

శెట్టూరు: మండలంలో లింగదీర్లపల్లి, బచ్చహళ్లి, కనుకూరు, ముచ్చర్లపల్లి, అనుంపల్లి గ్రామాల్లో శనివారం తెదేపా నాయకులు ప్రచారం నిర్వహించారు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కన్వీనర్‌ తిప్పేస్వామి, నాయకులు రామరాజు, అశ్వర్థ, పాల్గొన్నారు.

పార్టీని ఆదరించండి

డి.హీరేహాళ్‌: ఎన్నికల్లో తెదేపాను ఆదరించాలని పార్టీ కన్వీనర్‌ హనుమంతురెడ్డి కోరారు. నాగలాపురం గ్రామంలో సూపర్‌సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పిస్తూ, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీనియర్‌ నాయకులు కాదలూరు మోహన్‌రెడ్డి, పాటిల్‌అజయ్‌కుమార్‌రెడ్డి, గంగాధర, మల్లికార్జున, గోవింద్‌, వెంకటేశులు, తిప్పేస్వామి, పాల్గొన్నారు.

బాబు రావాలి.. బతుకులు మారాలి

కణేకల్లు: చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అందరి బతుకులు మారతాయని తెదేపా ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ తనయుడు వీక్షత్‌, ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు కుమార్తె గౌతమి పేర్కొన్నారు. కొత్తపల్లిలో మండల కన్వీనర్‌ లాలెప్ప, నాయకుడు ఆనందరాజు, వన్నారెడ్డితో కలిసి వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఒక్క అవకాశం ఇవ్వండి

కంబదూరు, కుందుర్పి: కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు సతీమణి రమాదేవి, కోడలు ఇషిత శనివారం మండల పరిధిలోని కర్తనపర్తి, కె.కొత్తూరు, డి.చెన్నేపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. కుందుర్పి మండలంలోని బండమీదపల్లి, బొమ్మాజిపల్లి, తమ్మయ్యదొడ్డి గ్రామాలో అమిలినేని సురేంద్రబాబు సతీమణి రమాదేవి, కుమార్తె చరిత ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.

చంద్రబాబుతోనే రైతుల సంక్షేమం

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం రైతులకు ఎలాంటి రాయితీ పరికరాలు అందించలేదని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అన్ని విధాలా ఆదుకుంటారని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు తనయుడు యశ్వంత్‌ అన్నారు. శనివారం మండలంలోని మానిరేవు, గోళ్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఇంటింటికి వెళ్లి సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని