logo

వైకాపాకు షాక్‌ మంత్రి వచ్చిన రోజునే రాజీనామా..

అధికార వైకాపాకు షాక్‌ తగిలింది. హిందూపురంపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  శనివారం పట్టణానికి వచ్చి నాయకులు, కార్యకర్తలను దిశా నిర్దేశం చేశారు.

Published : 28 Apr 2024 03:56 IST

పార్టీనుంచి వైదొలగిన బెల్లం నరేశ్‌ 

రాజీనామా పత్రాలను చూపుతున్న నరేశ్‌

హిందూపురం పట్టణం: అధికార వైకాపాకు షాక్‌ తగిలింది. హిందూపురంపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  శనివారం పట్టణానికి వచ్చి నాయకులు, కార్యకర్తలను దిశా నిర్దేశం చేశారు. ఆ పార్టీ పట్టణ బీ బ్లాక్‌ కన్వీనర్‌ బెల్లం నరేశ్‌ రాజీనామా చేశారు. ఒక వైపున మంత్రి వాల్మీకులతో సమావేశం ఏర్పాటు చేయగా, అదే రోజునే వాల్మీకి నాయకుడైన నరేశ్‌ పార్టీ నుంచి వైదొలగడం గమనార్హం. కొంతకాలంగా అసంతృప్తిగా ఉంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. మొదట్లో పార్టీ సమన్వయకర్త భర్త ముఖ్య నాయకుడు వేణురెడ్డితో కలిసి పనిచేసినా, ఆ తర్వాత వారి మధ్య సమన్వయం కుదరలేదు. దీంతో పార్టీకి దూరమయ్యాడు. పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించిన లేఖలను జిల్లా అధ్యక్షుడికి, మంత్రి పెద్దిరెడ్డికి, తదితరులకు పంపినట్లు నరేశ్‌ ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని