logo

పేదల భూముల కోసం నిర్విరామ పోరాటం

భూస్వాముల ఆక్రమణలో ఉన్న పేదల భూముల కోసం తమ పోరాటం ఆగదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు తెలిపారు.

Published : 24 Jan 2023 01:50 IST

ప్రదర్శన నిర్వహిస్తున్న నాయకులు

పలమనేరు, న్యూస్‌టుడే: భూస్వాముల ఆక్రమణలో ఉన్న పేదల భూముల కోసం తమ పోరాటం ఆగదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు తెలిపారు. సోమవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో సమీపంలో భూ సమస్యలపై సదస్సు నిర్వహించారు. అనేకమంది మంత్రులు, మేధావులు ఉన్న చిత్తూరు జిల్లాలో పేదల భూములు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. ఎస్‌ఈజడ్‌ పారిశ్రామీకరణ, నేషనల్‌ హైవే పేరుతో దళితుల భూములను లాక్కుని నష్టపరిహారం ఇవ్వకుండా వారికి ఎలాంటి పునరావాసం కల్పించలేదన్నారు. ఆర్డీవోకు తాము నివేదికను ఇస్తున్నామన్నారు. జగనన్న కాలనీకి ఎక్కువ భాగం దళితుల భూములే తీసుకోవడమే కాకుండా నష్టపరిహారం కూడా ఇవ్వకుండా చేసిన సంఘటనలు ఉన్నాయని ఆయన అన్నారు. తమ పార్టీ జెండాలతో నాయకులు ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్రదర్శన నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హంగేరి ఓబుల్‌రాజు, ఈశ్వర్‌, సీఐటీయూ నాయకులు గిరిధరగుప్తా, భువనేశ్వరి, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని