icon icon icon
icon icon icon

CM Revanth reddy: రాష్ట్రంలో 9 నుంచి 13 ఎంపీ స్థానాలు గెలుస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 9 నుంచి 13 ఎంపీ స్థానాలు గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

Published : 14 May 2024 19:31 IST

హైదరాబాద్‌: తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 9 నుంచి 13 ఎంపీ స్థానాలు గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్‌ సరళిపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సికింద్రాబాద్‌లో గతం కంటే పోలింగ్‌ మెరుగైందని, కాంగ్రెస్‌ అభ్యర్థికి కనీసం 20వేల మెజార్టీ వస్తుందన్నారు.

‘‘ఆరేడు స్థానాల్లో భారాసకు డిపాజిట్లు కూడా రావు. మెదక్‌లో భాజపా మూడో స్థానంలోకి వెళ్లింది. ఏ పార్టీకి ఆ పార్టీ పనిచేసి ఉంటే అంచనా వేయడం సులువు. భారాస శ్రేణులు పూర్తి స్థాయిలో భాజపాకు పనిచేశాయి. భాజపాకు కేంద్రంలో 220కి పది అటో, ఇటో వస్తాయి. ఇవాళ ఫీడ్‌ బ్యాక్‌ తెప్పించుకుంటే 13 స్థానాలు వస్తాయని సమాచారం ఉంది. ఇంతటితో రాజకీయ కార్యకలాపాలు ముగిశాయి. ఇప్పటినుంచి పరిపాలనపై దృష్టి ఉంటుంది. 

రైతు రుణమాఫీకి నిధులు సమకూరుస్తాం..

రైతు రుణమాఫీ, సమస్యలు, విద్యా సంవత్సరం మొదలుకానుంది, సన్నబియ్యం సరఫరా, పుస్తకాలు, యూనిఫామ్ తదితర అంశాలపై సమీక్ష చేస్తా. ఫార్మర్‌ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి దానికి ఆదాయం సమకూర్చుతాం. దాని ద్వారా రుణం తీసుకుని రైతు రుణమాఫీ చేస్తాం. రైతుకు పెట్టుబడి, గిట్టుబాటు ధరలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. రేషన్‌ దుకాణాల ద్వారా గతంలో మాదిరి ఎక్కువ వస్తువులు తక్కువ ధరకు ఇస్తాం. ఏయే వస్తువులు ఇవ్వొచ్చో పరిశీలించి నిర్ణయిస్తాం. ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు’’ అని సీఎం స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img