icon icon icon
icon icon icon

TS News: తెలంగాణలో 65.67శాతం పోలింగ్‌ : సీఈవో వికాస్‌రాజ్‌

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల తుది పోలింగ్‌ శాతం వివరాలను రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌  వెల్లడించారు.

Updated : 14 May 2024 22:29 IST

హైదరాబాద్‌: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల తుది పోలింగ్‌ శాతం వివరాలను రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌  వెల్లడించారు. సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరిగిన ఓటింగ్‌లో 65.67శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపారు. ‘‘అత్యధికంగా భువనగిరి పార్లమెంట్‌లో 76.78శాతం పోలింగ్‌ నమోదు కాగా, అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48 శాతం నమోదైంది. నర్సాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 84.25 శాతం, మలక్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యల్పంగా 42.76శాతం నమోదైంది. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 3 శాతం పోలింగ్‌ పెరిగింది. జూన్‌ 4న 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది’’ అని సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు.

పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీ పోలింగ్‌ శాతం వివరాలు

  • ఆదిలాబాద్‌ - 74.03
  • సికింద్రాబాద్- 49.04
  • హైదరాబాద్‌ - 48.48
  • మల్కాజిగిరి - 50.07
  • జహీరాబాద్‌ - 74.63
  • పెద్దపల్లి - 67.87
  • కరీంనగర్‌ - 72.54
  • నిజామాబాద్‌ - 71.92
  • మెదక్‌ - 75.09
  • చేవెళ్ల - 56.50
  • మహబూబ్‌నగర్‌ - 72.43
  • నాగర్‌ కర్నూల్‌ - 69.46
  • నల్గొండ - 74.02
  • భువనగిరి - 76.78
  • వరంగల్‌ - 68.86
  • మహబూబాబాద్‌ - 71.85
  • ఖమ్మం - 76.09
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img