logo

నాడు-నేడు.. ఇక ఏనాడో?

ఐతేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో రెండో విడత నాడు నేడు కింద రూ.1.36 కోట్లతో పనులు ప్రారంభించారు. 45 శాతం పనులే జరిగాయి. గదుల నిర్మాణం పూర్తికాలేదు.

Updated : 18 Mar 2024 05:48 IST

నిధులు విడుదల చేయని ప్రభుత్వం
పనులు చేసేందుకు గుత్తేదారుల వెనకడుగు

ఐతేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో రెండో విడత నాడు నేడు కింద రూ.1.36 కోట్లతో పనులు ప్రారంభించారు. 45 శాతం పనులే జరిగాయి. గదుల నిర్మాణం పూర్తికాలేదు.


విద్య, వైద్యం.. ఈ రెండూ గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతాయి.. వీటికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది.. వీటి కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం...

ఇదీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిత్యం వల్లెవేసే మాటలు..

ఇవన్నీ కేవలం మాటలకు మాత్రమే పరిమితమయ్యాయి. నాడు-నేడు కింద చేపట్టిన పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయి. గుత్తేదారులకు నిధులు చెల్లించకపోవడంతో వారు పనులు నిలిపివేశారు.


ఏర్పేడు మండలం బండారుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు నిధుల కింద శ్లాబ్‌ వరకే పనులు జరిగాయి. నిధులు విడుదల చేయకపోవడంతో పక్కనపెట్టారు.


రేణిగుంట గ్రామ సచివాలయం-3 భవనాన్ని శ్లాబు వరకు నిర్మించారు. తర్వాత ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు.


సూళ్లూరుపేట పరిధిలోని మన్నారుపోలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.1.60 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత రూ.70 లక్షలు విడుదల చేశారు. తర్వాత మరో రూ.15 లక్షలు ఇచ్చారు. పది గదులు నిర్మించేందుకు ప్రతిపాదించినా ఎనిమిదే నిర్మించారు. వాటినీ పూర్తిస్థాయిలో చేయలేదు. నిధులు లేకపోవడంతో పనులు సాగడం లేదు.

ఈనాడు-తిరుపతి: జిల్లా పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులన్నీ   అసంపూర్తిగానే మిగిలిపోతున్నాయి. గొప్పల కోసం పనులు ప్రారంభించినా నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. సొమ్ము చెల్లిస్తేనే పనులు పూర్తి చేస్తామంటూ గుత్తేదారులు స్పష్టం చేస్తున్నారు.

పనులు అప్పగించిన తర్వాత గుత్తేదారులు తొలుత బాగానే చేశారు. వారు బిల్లులు పెట్టడంతో మంజూరు నిలిపివేశారు. అదేమని అడిగితే పనులు పూర్తి చేసిన తర్వాతే చెల్లిస్తామంటూ అధికారుల సమాధానం రావడంతో వారు కంగుతిన్నారు. సిమెంటుకు కూడా నిధులు మంజూరు చేయకపోడంతో గుత్తేదారులు ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు. అటు పాఠశాలల దగ్గర నుంచి ఇటు ఆర్‌బీకేలు, గ్రామ సచివాలయ పనులన్నీ  ఆగిపోయాయి.


అప్పులు చేసి..

నులు చేస్తే ఎంతో కొంత మిగులుతుందని భావించిన కొందరు గుత్తేదారులు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా అప్పులు చేసి కొనసాగించారు. ప్రభుత్వం తమను విస్మరించడంతో అప్పులకు వడ్డీలు కట్టుకోవాల్సిన దుస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. ఇప్పుడు ఇసుకతోపాటు కూలీల ధరలు పెరిగాయని, పనులు చేయడం కష్టమని చెబుతున్నారు. వైకాపా ప్రభుత్వంతో పనులు చేసినా అప్పులపాలు కావాల్సిందేనని వాపోతున్నారు. మొత్తంగా చూస్తే వైకాపా ప్రభుత్వం కేవలం      ప్రగల్భాలు పలకడం తప్ప క్షేత్రస్థాయిలో చేస్తున్నది ఏమీ లేదని పలువురు  విమర్శిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని