logo

44 నామినేషన్ల దాఖలు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం 44 నామినేషన్లు దాఖలయ్యాయి.

Published : 23 Apr 2024 05:38 IST

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం 44 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి సంబంధించి రిటర్నింగ్‌ అధికారి షన్మోహన్‌కు.. అభ్యర్థులు చిట్టిబాబు(కాంగ్రెస్‌), రెడ్డెప్ప రెండు సెట్లు(వైకాపా), రెడ్డెమ్మ రెండు సెట్లు(వైకాపా), నాగేశ్వరరావు (జాతీయ జనసేన పార్టీ), జానకీరామరావు(నేషనల్‌ మహాసభ పార్టీ) తమ నామపత్రాలు అందజేశారు. ః చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆర్వో శ్రీనివాసులు అభ్యర్థుల నామపత్రాల్ని స్వీకరించారు. ప్రతిమ కంచర్ల రెండు సెట్లు (తెదేపా), టికారాం (కాంగ్రెస్‌ పార్టీ), ప్రభాకర్‌రెడ్డి (స్వతంత్ర), ఇందుమతి.. వైకాపా తరఫున రెండు సెట్లు, స్వతంత్ర అభ్యర్థిగా మరో రెండు సెట్ల నామపత్రాల్ని అందించారు. పూతలపట్టులో 7, పలమనేరు, కుప్పంలో 6, పుంగనూరులో 5, జీడీనెల్లూరులో 4, నగరిలో ఒకటి చొప్పున నామపత్రాలు దాఖలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని