logo

‘పది’లో 11 మెట్లు పైకెక్కి

పదో తరగతి ఫలితాల్లో గతేడాది 17వ స్థానంలో నిలిచిన జిల్లా..  ఈ విడత ఆరో స్థానానికి చేరింది.. ముఖ్యంగా ఈసారి బాలికలదే పైచేయి. జిల్లాలో 20,939మంది(బాలురు 10,793మంది, బాలికలు 10,146మంది) విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

Published : 23 Apr 2024 05:44 IST

17 నుంచి ఆరో స్థానానికి చేరిన జిల్లా
91.28% ఉత్తీర్ణత
లికల్లో 93.8%
బాలురలో 88.91%

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: పదో తరగతి ఫలితాల్లో గతేడాది 17వ స్థానంలో నిలిచిన జిల్లా..  ఈ విడత ఆరో స్థానానికి చేరింది.. ముఖ్యంగా ఈసారి బాలికలదే పైచేయి. జిల్లాలో 20,939మంది(బాలురు 10,793మంది, బాలికలు 10,146మంది) విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 19,113మంది(బాలురు 9,596మంది, బాలికలు 9,517మంది) ఉత్తీర్ణత సాధించారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికంగా.. ప్రథమ శ్రేణిలో 15,463మంది పాస్‌ కాగా, ద్వితీయ శ్రేణిలో 2,593మంది, తృతీయ శ్రేణిలో 1,057మంది విద్యార్థులు విజేతలుగా నిలిచారు.

159 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత

జిల్లాలో వంద శాతం ఫలితాలను 159 పాఠశాలలు సాధించాయి.. ఇందులో పాఠశాలల యాజమాన్యాల వారీగా జడ్పీలో 58, ఎయిడెడ్‌ ఒకటి, కేజీబీవీలు మూడు, రెసిడెన్షియల్‌, ఆదర్శ, ప్రభుత్వ, బీసీ వెల్ఫేర్‌లో రెండు చొప్పున, సోషల్‌ వెల్ఫేర్‌లో ఐదు, గిరిజన సంక్షేమంలో ఒకటి, ప్రైవేటు పాఠశాలలు 83 ఉన్నాయి.
ఇంకా ఉత్తమ ఫలితాలు సాధించాలి: డీఈవో.. పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు మంచి ఫలితాలు వచ్చాయి. ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రణాళికాబద్దంగా రానున్న విద్యా సంవత్సరంలో ముందుకెళ్లనున్నట్లు డీఈవో దేవరాజు తెలిపారు. ఈసారి నాణ్యత ప్రమాణాలతో బోధించి సత్ఫలితాలు సాధిస్తామని చెప్పారు. రాష్ట్రంలో మూడు, నాలుగు స్థానాల్లో జిల్లా నిలుస్తుందని భావించాం.. అయితే ఆరో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.


ఇంకా ఉత్తమ ఫలితాలు సాధించాలి

డీఈవో.. పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు మంచి ఫలితాలు వచ్చాయి. ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రణాళికాబద్దంగా రానున్న విద్యా సంవత్సరంలో ముందుకెళ్లనున్నట్లు డీఈవో దేవరాజు తెలిపారు. ఈసారి నాణ్యత ప్రమాణాలతో బోధించి సత్ఫలితాలు సాధిస్తామని చెప్పారు. రాష్ట్రంలో మూడు, నాలుగు స్థానాల్లో జిల్లా నిలుస్తుందని భావించాం.. అయితే ఆరో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.


తండ్రి మరణాన్ని దిగమింగి

ఐరాల, కల్లూరు, న్యూస్‌టుడే: చేయి పట్టిన నడిపిన తండ్రి అకాల మరణం చెందడంతో ఆ బాధలోనూ ఇద్దరు విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు.  సోమవారం విడుదలైన ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి అందరి మన్నన అందుకున్నారు. వీరే ఐరాల మండలం నాగంవాండ్లపల్లె పంచాయతీ వీఎస్‌ అగ్రహారానికి చెందిన చలపతి కుమారుడు సంతోష్‌, కల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన వైష్ణవిలు. సంతోష్‌ తండ్రి చలపతి, వైష్ణవి తండ్రి కె.నాగరాజ కన్నుమూశారు. పది ఫలితాల్లో సంతోష్‌ 504, వైష్ణవి 536 మార్కులు సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని