logo

ఇదేం పని మురుగేషా!

బోధనారంగంలో ఉత్తమ ప్రతిభకనబరిచిన ఆ ఉపాధ్యాయుడికి 2007-08 విద్యాసంవత్సరంలో జిల్లాస్థాయి అవార్డు దక్కింది. దీనిపై స్పందించిన మండల ప్రజాప్రతినిధులు.. కుటుంబ సభ్యుల పేరుతో మూడు ఇంటి పట్టాలు అందించారు.

Published : 29 Apr 2024 03:20 IST

దౌర్జన్యంగా ఉపాధ్యాయుడి ఇంటి నిర్మాణం కూల్చివేత

ఆక్రమణదారులు చదును చేసిన పొన్నాంగూరు సర్వే సంఖ్య 8-1లోని స్థలం

 కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: బోధనారంగంలో ఉత్తమ ప్రతిభకనబరిచిన ఆ ఉపాధ్యాయుడికి 2007-08 విద్యాసంవత్సరంలో జిల్లాస్థాయి అవార్డు దక్కింది. దీనిపై స్పందించిన మండల ప్రజాప్రతినిధులు.. కుటుంబ సభ్యుల పేరుతో మూడు ఇంటి పట్టాలు అందించారు. ఆ స్థలాల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పునాది(కడగాలు) నిర్మించుకున్నారు. తీరా.. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ కడగాలును జేసీబీలతో నేలమట్టం చేయడంపై బాధితుడు లబోదిబోమంటున్నారు. ‘రూ.3 లక్షలకుపైగా ఖర్చు చేసి కడగాలు నిర్మించుకున్నా. వైకాపా మండల కన్వీనర్‌ మురుగేష్‌, అతని అనుచరులు కలిసి నాకు తెలియకుండా దౌర్జన్యంగా కూల్చారు. ఈ విషయాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశా. అక్కడి నుంచి వివరాలు అందించాలని తహసీల్దారు కార్యాలయానికి లేఖ వచ్చినా.. అప్పటి తహసీల్దారు సురేష్‌బాబు నీవు నా వద్దకు రావద్దని.. మీరే ఏదో సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని సమాధానమిచ్చారు’ అని బాధిత ఉపాధ్యాయుడు రామచంద్రన్‌ ‘న్యూస్‌టుడే’తో ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంటి పత్రాలు చూపుతున్న విశ్రాంత ఉపాధ్యాయుడు రామచంద్రన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని