logo

సీఎం వచ్చారని తెచ్చారు.. వెళ్లారని వదిలేశారు

ఈ నెల 18న ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో బస్సు యాత్రం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైకాపా నేతలు, అధికారులు నానా హడావుడి చేశారు.

Updated : 23 Apr 2024 08:20 IST

నాడు: డివైడర్లపై పచ్చగడ్డి పరుస్తూ..

న్యూస్‌టుడే, దేవీచౌక్‌: ఈ నెల 18న ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో బస్సు యాత్రం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైకాపా నేతలు, అధికారులు నానా హడావుడి చేశారు. ఆయన వచ్చే మార్గంలో ఎక్కడా సమస్య అనేదే కనిపించకుండా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హడావుడిగా పనులు మొదలు పెట్టారు. పేపరుమిల్లు రోడ్డులో డివైడర్‌కు ఊడిపోయిన పలకలు అంటించేందుకు, మధ్యలో గ్రీనరీ ఏర్పాటు చేయాలని సామగ్రి తరలించారు. సీఎం వచ్చేసరికి రాత్రి కావడంతో చూడరనుకున్నారో ఏమో పనులు పూర్తికాకుండానే వదిలేశారు. రూ.వేలు ఖర్చుచేసి తెచ్చిన వాటిని ముఖ్యమంత్రి వెళ్లిన తర్వాతైనా చేయొచ్చు. ఎక్కడివక్కడే వదిలేసి చేతులు దులుపుకున్నారు. డివైడర్‌కు అంటించే పలకల బాక్సులను రోడ్డు పక్కన, మధ్యలో పడేశారు. పచ్చగడ్డిని సైతం వదిలేయడంతో ప్రస్తుతం ఎండిపోయింది. దీంతో ఏమాత్రం పచ్చదనం కనపడటం లేదు. అంటించిన పలకలు చాలాచోట్ల ఊడిపోయాయి. నాణ్యత లేకపోవడం వల్లే వేసిన కొద్ది రోజుల్లోనే ఊడిపోయాయని స్థానికులు అంటున్నారు. ముఖ్యమంత్రి వస్తేనే పనులు చేస్తారా.. లేకపోతే అంతేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం ఎండిపోయిందిలా..

పలకలు రోడ్డుపక్కనే..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని