logo

ఉమ్మడి జిల్లాల ఎక్సైజ్‌ అధికారులకు సహకరిస్తాం..

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా యానాంలో మద్యం అమ్మకాల నియంత్రణ, అక్రమ రవాణా జరక్కుండా తగిన చర్యలకు తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని పరిపాలనాధికారి ఆర్‌.మునిస్వామి తెలిపారు.

Published : 28 Apr 2024 03:54 IST

మాట్లాడుతున్న పరిపాలనాధికారి మునిస్వామి

యానాం, న్యూస్‌టుడే: ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా యానాంలో మద్యం అమ్మకాల నియంత్రణ, అక్రమ రవాణా జరక్కుండా తగిన చర్యలకు తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని పరిపాలనాధికారి ఆర్‌.మునిస్వామి తెలిపారు. కాకినాడ, కోనసీమ జిల్లాల ఎక్సైజ్‌ అధికారులు ఎస్‌కేడీవీ ప్రసాద్‌, సీహెచ్‌ అజయ్‌కుమార్‌సింగ్‌, యానాం ఎస్పీ రాజశేఖర్‌లతో కలిసి మునిస్వామి విలేకరులతో శనివారం ఉదయం మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న పరిస్థితిలో కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కాకినాడ జిల్లా అధికారి ప్రసాద్‌ మాట్లాడుతూ మే 13న ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి మే 11 నుంచి యానాంలో మద్యం దుకాణాలు మూసేయాలని, చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. ఎన్నికల సమయంలో మద్యం, నగదు పంపిణీ జరక్కుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి జి.అమర్‌బాబు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి సాయిస్వరూప్‌, ముమ్మిడివరం, తాళ్లరేవు ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్లు రామారావు, లక్ష్మీకాంతం, శ్రీధర్‌, డీటీ జ్యోతి వెంకటేశ్వరరావు, యానాం సీఐ షణ్ముగం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు