logo

బ్రాహ్మణ సమాజం ఏకం కావాలి: నాగబాబు

బ్రాహ్మణ సమాజ అభ్యున్నతికి బ్రాహ్మణులంతా ఏకం కావాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పిలుపునిచ్చారు. ఆదివారం పిఠాపురంలో బ్రహ్మణ సంఘాలు నాగబాబును కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు.

Published : 29 Apr 2024 06:14 IST

లక్ష్మీ గణపతి హోమం చేస్తున్న నాగబాబు, పద్మ దంపతులు

పిఠాపురం: బ్రాహ్మణ సమాజ అభ్యున్నతికి బ్రాహ్మణులంతా ఏకం కావాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పిలుపునిచ్చారు. ఆదివారం పిఠాపురంలో బ్రహ్మణ సంఘాలు నాగబాబును కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురాన్ని టెంపుల్‌ సర్క్యూట్‌ సిటీగా అభివృద్ధి చేసేందుకు పవన్‌ కల్యాణ్‌ సిద్ధంగా ఉన్నారన్నారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.100 కోట్లు కేటాయిస్తారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ విషయాన్ని పొందుపరిచారని చెప్పారు. దేవస్థానాలపై దాడులు జరిగినప్పుడు ఎవరూ ముందుకు వచ్చిన దాఖలాలు లేవని, వైకాపా నాయకులు చాలా తేలికగా ఈ విషయాలు తీసుకున్నారన్నారు. పవన్‌ ఒక్కరే ఈ విషయంపై తీవ్రస్థాయిలో స్పందించారన్నారు. అనంతరం, పిఠాపురంలోని విరవాడ రోడ్డులో జరిగిన లక్ష్మీ గణపతి హోమంలో నాగబాబు, పద్మా దంపతులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద ఆశీర్వాచనాలు పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని