logo

తాళ్లపూడిలో తెదేపా ఎన్నికల ప్రచారం

ఉమ్మడి పార్టీల మ్యానిఫెస్టో  అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని  తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు.

Published : 02 May 2024 13:20 IST

తాళ్లపూడి: ఉమ్మడి పార్టీల మ్యానిఫెస్టో  అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. తాళ్లపూడి మండలంలోని అన్నదేవరపేటలో తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో రోడ్‌ షో, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరిని కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. . ఈ కార్యక్రమంలో చాగల్లు జడ్పీటీసీ మాజీ సభ్యుడు విక్రమాదిత్య, కొరారు వెంకట్రావు, కాకర్ల సత్యేంద్ర, గణపతికృష్ణ, చెవ్వూరి బంగ్రారాజు, ఎలుగుబండి బాలకృష్ణ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని