నకిలీ ఎస్సై గుట్టు రట్టు
రైలులో హల్చల్ చేస్తున్న ఓ నకిలీ ఎస్సైను ఏలూరు రైల్వే పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాలు... గుంటూరు సంగటిగుంటకు చెందిన చాగంటి పవన్ తిరుమలేష్ ఇంటర్ వరకు చదివాడు. తండ్రి నరసింహారావు ప్రైవేటు వ్యాపారి.
నిందితుడిని అరెస్టు చేసిన రైల్వే పోలీసులు
పవన తిరుమలేష్
ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : రైలులో హల్చల్ చేస్తున్న ఓ నకిలీ ఎస్సైను ఏలూరు రైల్వే పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాలు... గుంటూరు సంగటిగుంటకు చెందిన చాగంటి పవన్ తిరుమలేష్ ఇంటర్ వరకు చదివాడు. తండ్రి నరసింహారావు ప్రైవేటు వ్యాపారి. తిరుమలేష్ ఇంటర్‌తో చదువు ఆపి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. సులభంగా డబ్బు సంపాదించాలని గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో పలు ద్విచక్ర వాహనాలు చోరీ చేశాడు. ఇతనిపై ఆయా పోలీసుస్టేషన్లలో కేసులున్నాయి. ప్రయాణికులను బెదిరించి డబ్బు దండుకోవచ్చనే ఉద్దేశంతో ఎస్సై దుస్తులు ధరించి విజయవాడ నుంచి విశాఖ వెళ్లే రైల్లో ప్రయాణిస్తుండగా ఏలూరులో రైల్వే పోలీసులకు ఇతని ప్రవర్తనపై అనుమానం వచ్చింది. పొడుగ్గా లేకపోవడం, అనుమానాస్పదంగా కనిపించడంతో విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో అతడిని అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్‌బరేలీలో గెలవండి.. రాహుల్‌కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్‌న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్‌పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం