logo
Published : 03/12/2021 02:55 IST

ఓట్ల తొలగింపుపై ప్రశ్నిస్తే అక్రమ కేసులా?

పోలీసుస్టేషన్‌ ఎదుట తెదేపా నాయకుల ఆందోళన


నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే శ్రీధర్‌, పార్టీ నేతలు

పెదకూరపాడు, న్యూస్‌టుడే: అమరావతి గ్రామంలో 300కు పైగా తెదేపా సానుభూతి పరుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ, తెదేపా మైనారిటీ నాయకుడు జానీ గురువారం అధికారులను ప్రశ్నించారు. ఆయా ఓటర్లు ఎప్పటినుంచో ఇక్కడే ఉంటున్నారని, గత స్థానిక ఎన్నికల్లో కూడా ఓట్లు వేశారని, ఇప్పుడెలా తొలగిస్తారని మండిపడ్డారు. దీంతో తన విధులకు ఆటంకం కలిగించారని పంచాయతీ కార్యదర్శి, బీఎల్‌ఓ నాగరాజు ఫిర్యాదు చేయడంతో పోలీసులు జానీని అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే శ్రీధర్‌ అమరావతి వచ్చారు. పోలీస్‌స్టేషన్‌ ఎదుట తెదేపా నేతలు, కార్యకర్తలతో కలసి నిరసన తెలిపారు. తెదేపా సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు వైకాపా నాయకులు భారీ కుట్రకు తెరతీశారని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా అని ప్రశ్నించారు. సీఐ రాజేష్‌కుమార్‌తో మాట్లాడారు. ఓట్ల తొలగింపు బాధ్యులను గుర్తించి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పోలీసులు జానీకి నోటీసులిచ్చి పంపించి వేశారు. ఆందోళనలో గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్‌ వెన్నా సాంబశివారెడ్డి, వేగుంట రాణి, పూజల వెంకట కోటయ్య, బోడపాటి చిన్నయ్య, మండల తెదేపా నేతలు పాల్గొన్నారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని