logo

పదిలో పెరిగిన ఉత్తీర్ణత

పదోతరగతి పరీక్షల్లో పల్నాడు జిల్లా విద్యార్థులు నిరుటి కంటే 16 శాతం అదనంగా ఉత్తీర్ణత సాధించారు. కాగా రాష్ట్రస్థాయిలో జిల్లా 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 24959 మందికి గాను 21477 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

Published : 23 Apr 2024 05:45 IST

రాష్ట్రస్థాయిలో జిల్లాకు 18వ స్థానం 

నరసరావుపేట అర్బన్‌ న్యూస్‌టుడే: పదోతరగతి పరీక్షల్లో పల్నాడు జిల్లా విద్యార్థులు నిరుటి కంటే 16 శాతం అదనంగా ఉత్తీర్ణత సాధించారు. కాగా రాష్ట్రస్థాయిలో జిల్లా 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 24959 మందికి గాను 21477 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇది 86.05 శాతంగా ఉంది. బాలురు 83.73 శాతం, బాలికలు 88.45 శాతం ఉత్తీర్ణులయ్యారు. నిరుడు జిల్లాలో 69.47 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 86.05 శాతానికి పెరిగింది. వీరిలో 550 మార్కులకు పైబడి సాధించిన విద్యార్థులు 270 మంది ఉండగా 500 నుంచి 549 మార్కులు సాధించిన వారు 5707 మంది ఉన్నారు.

మెరుగైన ఫలితాలు సాధించాం

పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని మెరుగు పరుచుకున్నాం. గతేడాది కంటే 16 శాతం అధికంగా విద్యార్థులు సాధించారు. అంతే కాకుండా 500 మార్కులకు పైగా 5977 మంది సాధించారు. ఇది మొత్తం విద్యార్థుల సంఖ్యలో 27.8 శాతం ఉంది. ప్రథమశ్రేణిలో 16769 మంది, ద్వితీయ శ్రేణిలో 3222, తృతీయ శ్రేణిలో 1486 మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రస్థాయిలో ర్యాంకులు కూడా సాధించే విధంగా జిల్లా విద్యార్థులు రాణించారు. రానున్న రోజుల్లో మంచి ఫలితాలు సాధించేందుకు చర్యలు తీసుకుంటాం.

 ఎం.వెంకటేశ్వర్లు, డీఈవో నరసరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని