logo

ప్రత్తిపాడును అగ్రగామిగా నిలుపుతా: బూర్ల

నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలుపుతానని ప్రత్తిపాడు కూటమి అభ్యర్థి డాక్టరు బూర్ల రామాంజనేయులు హామీ ఇచ్చారు. సోమవారం ఆయన నామినేషన్‌ దాఖలు కార్యక్రమం విజయోత్సవాన్ని తలపించింది.

Published : 23 Apr 2024 05:55 IST

రామాంజనేయులు దంపతులకు గజమాలతో స్వాగతం 

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలుపుతానని ప్రత్తిపాడు కూటమి అభ్యర్థి డాక్టరు బూర్ల రామాంజనేయులు హామీ ఇచ్చారు. సోమవారం ఆయన నామినేషన్‌ దాఖలు కార్యక్రమం విజయోత్సవాన్ని తలపించింది. గుంటూరు సాయిబాబా రోడ్డులోని తెదేపా కార్యాలయం నుంచి బయలుదేరిన ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఏటుకూరు జాతీయ రహదారి వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రత్తిపాడుకు ర్యాలీ ప్రారంభించారు. జనసేన నాయకులు గజమాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. 15 కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగింది.

స్వల్ప తోపులాట:  తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రత్తిపాడు అసెంబ్లీ అభ్యర్థిగా డాక్టరు బూర్ల రామాంజనేయులు సోమవారం ప్రత్తిపాడు తహసీˆల్దారు కార్యాలయంలో ఆర్వో పి.శ్రీకర్‌కు నామపత్రాలను దాఖలు చేశారు. తొలుత కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద పోలీసుల తీరుతో స్వల్ప తోపులాట జరిగింది. కూటమి అభ్యర్థి రామాంజనేయులు, తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే రావి వెంకట రమణ, తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి తాడిశెట్టి మురళీ, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొర్రపాటి నాగేశ్వరరావు, భాజపా నియోజకవర్గ సమన్వయకర్త కన్నా రవిదేవరాజు, భారీ సంఖ్యలో కూటమి కార్యకర్తలతో కలిసి తాడు, బారికేడ్ల వద్దకు రాగానే, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో అభ్యర్థి రామాంజనేయులు, సతీమణి జయమ్మ, నేతలు సైతం కొంత ఇబ్బంది పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని