logo

సమర్థ్‌ యాప్‌తో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు

సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలీసుశాఖ సమర్థంగా విధులు నిర్వర్తించేలా వేగవంతమైన పోలీసు సేవల కోసం కొత్తగా సమర్థ్‌ మొబైల్‌ యాప్‌ను రూపొందించినట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

Published : 23 Apr 2024 06:31 IST

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న ఎస్పీ వకుల్‌ జిందాల్‌, అదనపు ఎస్పీ విఠలేశ్వర్‌

బాపట్ల, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలీసుశాఖ సమర్థంగా విధులు నిర్వర్తించేలా వేగవంతమైన పోలీసు సేవల కోసం కొత్తగా సమర్థ్‌ మొబైల్‌ యాప్‌ను రూపొందించినట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సమర్థ్‌ యాప్‌పై అవగాహన కల్పిస్తూ రూపొందించిన కరపత్రాలను ఆయన సోమవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల రోజు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఇతర ప్రదేశాల్లో ఏదైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటే ఈ ప్రదేశాలకు దగ్గర్లో ఉన్న పోలీసు అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని శాంతిభద్రతలను పరిరక్షించేలా యాప్‌ను రూపొందించినట్లు వివరించారు. మొత్తం జిల్లా పోలీసు బలగాల ప్రాంతాలను ఎప్పటికప్పుడు గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ట్రాకింగ్‌ చేయవచ్చన్నారు.  ఒక్క నోటిఫికేషన్‌ ద్వారా జిల్లాలో 2 వేల మంది పోలీసులకు ఒకేసారి ఆదేశాలు జారీ చేయవచ్చని తెలిపారు. ఎన్నికల నియమావళికి సంబంధించిన సమస్త సమాచారం, శిక్షణ మెటీరియల్‌ సమర్థ్‌ యాప్‌లో పొందుపరిచినట్లు చెప్పారు. అదనపు ఎస్పీ టీపీ విఠలేశ్వర్‌, ఎస్‌బీ సీఐ వి.మల్లికార్జునరావు, ఎన్నికల విభాగం సీఐ కె.శ్రీనివాసరెడ్డి, డీసీఆర్బీ సీఐ పి.బాలమురళీకృష్ణ, ఐటీ కోర్‌ ఎస్సై నాయబ్‌ రసూల్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని