logo

పదిలో పైచేయి అమ్మాయిలదే

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 88.19 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికల హవా స్పష్టంగా కనిపించింది. బాలికలు 90.1 శాతం ఉత్తీర్ణులు కాగా, బాలురు 86.32 శాతం ఉత్తీర్ణులయ్యారు.

Updated : 23 Apr 2024 07:07 IST

 జిల్లాలో ఉత్తీర్ణత శాతం 88.19
 ఫలితాల్లో జిల్లాకు రాష్ట్రస్థాయిలో 14వ స్థానం 

బాపట్ల, న్యూస్‌టుడే : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 88.19 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికల హవా స్పష్టంగా కనిపించింది. బాలికలు 90.1 శాతం ఉత్తీర్ణులు కాగా, బాలురు 86.32 శాతం ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కన్నా ఈసారి ఉత్తీర్ణతా శాతం 12.88 పెరిగింది. కాని పది ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా తొమ్మిదో స్థానం నుంచి పద్నాలుగో స్థానానికి పడిపోయింది. వెదుళ్లపల్లి బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. పరీక్షకు హాజరైన మొత్తం 25 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.  

నూరుశాతం ఉత్తీర్ణణత సాధించిన పాఠశాలలివే..

బాపట్ల, న్యూస్‌టుడే: జిల్లాలో 19 జడ్పీ ఉన్నత పాఠశాలలు, రెండు గురుకుల పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. బల్లికురవ మండలంలో పెదఅంబడిపూడి, ఉప్పుమాగులూరు, మార్టూరు మండలంలో కోలలపూడి, కోనంకి, ద్రోణాదుల, దర్శి, చిందిరిబండ, నగరం మండలంలో పెద్దవరం, పీజీపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలల విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణులయ్యారు. యద్దనపూడి గురుకుల విద్యాలయం, పర్చూరు గిరిజన గురుకులం నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి.

బాపట్ల విద్యార్థి షేక్‌ రెహాన్‌ హఫీజ్‌ 595 మార్కులు

షేక్‌ నాగూర్‌ వలీకి 591 మార్కులు

మార్టూరు మండలం వలపర్ల జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన షేక్‌ నాగూర్‌ వలీ 591 మార్కులు సాధించాడు. తండ్రి షేక్‌ బాజీ భవన నిర్మాణ కార్మికుడు కాగా, తల్లి మస్తాన్‌బీ గృహిణి. నాగూర్‌వలీకి చదువంటే ఇష్టమని, రోజులో అత్యధిక సమయం పుస్తకాలతో కుస్తీపట్టేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

  • బాలుర శాతం86.32
  • హాజరైన బాలికలు 8221
  • ఉత్తీర్ణులైన బాలికలు 7408
  • ఉత్తీర్ణులైన బాలురు7335
  • పరీక్షకు హాజరైన బాలురు 8,497
  • గతేడాది ఉత్తీర్ణతా శాతం75.31
  • ఉత్తీర్ణులైన వారు: 14,743
  • ఉత్తీర్ణతా శాతం 88.19
  • బాలికల ఉత్తీర్ణతా శాతం 90.1
  • పరీక్షలకు హాజరైన విద్యార్థులు: 16,718
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని