logo

కోడ్‌ ఉల్లంఘనపై 60 కేసులు

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 60 కేసులు నమోదు చేశారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.

Published : 02 May 2024 06:38 IST

మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు వేణుగోపాల్‌రెడ్డి

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే:  జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 60 కేసులు నమోదు చేశారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. గుంటూరు కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై బుధవారం జిల్లా స్థాయి స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో కలెక్టరు మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచార కార్యక్రమంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలన్నారు. ప్రార్థనాలయాల్లో ప్రచారం చేయకూడదని స్పష్టం చేశారు. అభ్యర్థుల ప్రచార కార్యక్రమాల పర్యవేక్షణకు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే చర్యలు అరికట్టడానికి ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు, ఎఫ్‌ఎస్టీ, నిఘా బృందాలు నిరంతరం తనిఖీలు చేస్తున్నాయన్నారు. సీ-విజిల్‌ యాప్‌ ద్వారా వచ్చిన 286 ఫిర్యాదుల్లో నిర్దేశించిన 100 నిమిషాల వ్యవధిలో 279 (98 శాతం) పరిష్కరించినట్లు వివరించారు. సమావేశంలో జిల్లా శిక్షణ కలెక్టరు స్వప్నిల్‌ జగన్నాథ్‌, ఎంసీసీ నోడల్‌ అధికారి వీరాచారి, రాజకీయ పార్టీల ప్రతినిధులు కంచర్ల శివరామయ్య (తెదేపా), అత్తోట జోసఫ్‌ (వైకాపా), పి.ఎ.పద్మనాభరావు (భాజపా), బిళ్లా సునీల్‌ (కాంగ్రెస్‌), వై.కృష్ణకాంత్‌ (సీపీఎం), చిరతనగండ్ల వాసు (బీఎస్పీ) తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని