logo

TS Elections: కాంగ్రెస్‌ అవకాశం ఇస్తే ఎన్నికల్లో పోటీ చేస్తా: గద్దర్‌ కుమార్తె వెన్నెల

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రజా గాయకుడు గద్దర్‌ కుమార్తె వెన్నెల తెలిపారు.

Published : 21 Oct 2023 15:52 IST

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రజా గాయకుడు గద్దర్‌ కుమార్తె వెన్నెల తెలిపారు. రాజకీయాల్లోకి రావాలని చాలా మంది తనపై ఒత్తిడి తెస్తున్నారని.. తనకు కాంగ్రెస్‌ పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. తన తండ్రి ఆశయసాధన కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు వెల్లడించారు. గద్దర్‌ జీవితాంతం సమసమాజం కోసమే తనప పడ్డారన్నారు. టికెట్‌ ఇవ్వకపోయినా కాంగ్రెస్‌ పార్టీకే తన మద్దతు ఉంటుందని వెన్నెల స్పష్టం చేశారు. తన కుమార్తెకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇస్తే ప్రచారం చేయనున్నట్లు గద్దర్‌ భార్య విమల తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని