logo

ఉత్సాహంగా 5కే మెగా రన్‌ ఫర్‌ హెల్త్‌

వరల్డ్‌ హెల్త్‌ డేను పురస్కరించుకొని ఆదివారం యశోద హాస్పిటల్స్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) సంయుక్త ఆధ్వర్యంలో ‘‘5కే మెగా రన్‌ ఫర్‌ హెల్త్‌’’ పేరిట చేపట్టిన పరుగు ఉత్సాహంగా సాగింది.

Published : 08 Apr 2024 01:38 IST

పరుగులో పాల్గొన్న టీసీఎస్‌ ఉద్యోగులు

మాదాపూర్‌, న్యూస్‌టుడే: వరల్డ్‌ హెల్త్‌ డేను పురస్కరించుకొని ఆదివారం యశోద హాస్పిటల్స్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) సంయుక్త ఆధ్వర్యంలో ‘‘5కే మెగా రన్‌ ఫర్‌ హెల్త్‌’’ పేరిట చేపట్టిన పరుగు ఉత్సాహంగా సాగింది. ఆరోగ్యకరమైన జీవనశైలి పట్ల ఐటీ ఉద్యోగుల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ పరుగును యశోద హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పవన్‌ గోరుకంటి, టీసీఎస్‌ ప్రెసిడెంట్‌ రాజన్న జెండా ఊపి ప్రారంభించారు. టీసీఎస్‌ ఉద్యోగులు తమ కుటుంబసభ్యులతో కలిసి ఉత్సాహంగా పరుగులో పాల్గొన్నారు. యశోద హాస్పిటల్స్‌ నుంచి ప్రారంభమైన పరుగు ఐకియా చౌరస్తా మీదుగా తిరిగి యశోద హాస్పిటల్‌ వరకు సాగింది. డాక్టర్‌ పవన్‌ మాట్లాడుతూ..అనారోగ్యకరమైన జీనవశైలీని దూరం చేయడమే ఈ పరుగు లక్ష్యమన్నారు. వ్యాయామం దినచర్యలో భాగం కావాలని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని