logo

రూ.72 లక్షలు వడ్డీతో సహా చెల్లించండి

నిర్మాణ ఒప్పందానికి సంబంధించి బ్యాంకు గ్యారంటీలు చెల్లించకుండా కాలయాపన చేసిన ఐసీఐసీఐ బ్యాంకుకు హైదరాబాద్‌ వాణిజ్య వివాదాల కోర్టు మొట్టికాయలు వేసింది.

Published : 23 Apr 2024 04:12 IST

ఐసీఐసీఐ బ్యాంకును ఆదేశించిన వాణిజ్య వివాదాల కోర్టు 

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మాణ ఒప్పందానికి సంబంధించి బ్యాంకు గ్యారంటీలు చెల్లించకుండా కాలయాపన చేసిన ఐసీఐసీఐ బ్యాంకుకు హైదరాబాద్‌ వాణిజ్య వివాదాల కోర్టు మొట్టికాయలు వేసింది. రూ.72లక్షలు, 12శాతం వడ్డీ, కేసు విచారణ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు అయిన కాలాన్ని లెక్కగట్టి 6శాతం వడ్డీ కలిపి చెల్లించాలని ఆదేశించింది. కేరళలోని ఆలూరు గ్రామంలో రోహౌజ్‌ బంగ్లాల నిర్మాణానికి సంబంధించి లుక్రా మీడియా అండ్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌కు, ఏఎంఆర్‌ ఇండియా లిమిటెడ్‌కు మధ్య 2016 ఫిబ్రవరిలో నిర్మాణ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా ఏఎంఆర్‌ సంస్థ బ్యాంకు గ్యారంటీలను సమర్పించింది. ప్రతివాద సంస్థ ఒప్పంద హమీలను విస్మరించడంతో గ్యారంటీలు చెల్లించాలని ప్రతివాద బ్యాంకును కోరారు. డబ్బులు చెల్లించకుండా 1,096 రోజులు కాలయాపన చేశారంటూ ఫిర్యాదీ సంస్థ వాణిజ్య కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయస్థానం ఇందులో ఏఎంఆర్‌ సంస్థ ప్రమేయం తక్కువగా ఉందని పేర్కొంటూ పూర్తి మొత్తం చెల్లించాలని బేగంపేట్‌లోని ఐసీఐసీఐ బ్యాంకును ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని