logo

15 స్ట్రాంగ్‌ రూముల్లో.. 5వేల ఈవీఎంలు

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ ఎంపీ స్థానాలకు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికకు సంబంధించి ఈవీఎంలను సిద్ధం చేశామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ వెల్లడించారు.

Published : 23 Apr 2024 04:16 IST

జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ ఎంపీ స్థానాలకు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికకు సంబంధించి ఈవీఎంలను సిద్ధం చేశామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ వెల్లడించారు. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ క్రీడా ప్రాంగణంలో తాజాగా రెండో దశ ర్యాండమైజేషన్‌ పూర్తయిందని, తదనంతర ప్రక్రియలో భాగంగా వాటిని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా విభజించి, 15 స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచినట్లు తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల స్ట్రాంగ్‌ రూములనే ఎంపీ ఎన్నికలకు ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అక్కడే జరగనుందన్నారు. జిల్లాలోని 4వేల పోలింగ్‌ కేంద్రాలకు 5వేల ఈవీఎంలను సిద్ధం చేశామన్నారు. ముందు జాగ్రత్తగా పోలింగ్‌ కేంద్రాలకన్నా ఎక్కువ సంఖ్యలో ఈవీఎంలను సమకూర్చుకుని, కొన్నింటిని రిజర్వులో ఉంచుతామని పేర్కొన్నారు. ఎండల వల్ల వీవీప్యాట్లలో సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున, వాటిని మరింత ఎక్కువ మొత్తంలో సమకూర్చుకున్నట్లు గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని