logo

4 ఎంపీ స్థానాలకు 37 నామపత్రాలు

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాలకు మొత్తం 37 మంది అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు.

Published : 23 Apr 2024 04:20 IST

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాలకు మొత్తం 37 మంది అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్‌ స్థానానికి గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌ (భారాస), కాంగ్రెస్‌ నుంచి కన్నయ్యలాల్‌, సయ్యద్‌ షా ముజాహిద్‌ హుస్సేన్‌, అక్బరుద్దీన్‌ ఒవైసీ (ఎంఐఎం), ఇతరులు కలిపి ఆరుగురు నామినేషన్లు వేసినట్లు ఆర్వో, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి వెల్లడించారు. సికింద్రాబాద్‌ నుంచి 9 మంది దాఖలైనట్లు హైదరాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌, ఆర్వో హేమంత్‌ పాటిల్‌ తెలిపారు. చేవెళ్ల స్థానానికి మొత్తం 11 నామినేషన్లు వచ్చాయని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (భాజపా), కాసాని జ్ఞానేశ్వర్‌( భారాస), స్వతంత్రులు ఉన్నట్టు కలెక్టర్‌, ఆర్వో శశాంక తెలిపారు. మల్కాజిగిరి స్థానానికి మొత్తం 11 నామినేషన్లు రాగా పట్నం సునీత (కాంగ్రెస్‌), ఈటల రాజేందర్‌ (భాజపా) తదితరులున్నట్టు మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌, ఆర్వో గౌతమ్‌ వివరించారు.

కంటోన్మెంట్‌కు 9..

ఆర్వోకు నామపత్రాన్ని అందిస్తున్న శ్రీగణేశ్‌

కంటోన్మెంట్‌: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు సంబంధించి సోమవారం తొమ్మిది నామినేషన్లు వచ్చాయి. శ్రీగణేశ్‌ నారాయణన్‌ (కాంగ్రెస్‌), భారాస అభ్యర్థి జి.నివేదిత తరఫున ఆమె అనుచరుడు, ఎం.ఎ.శ్రీనివాస్‌ తదితరులు దాఖలు చేసినట్లు రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో) మధుకర్‌నాయక్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని