logo

నాలా.. సాఫీగా సాగేలా

నాలా పూడికతీత పనుల్లో జీహెచ్‌ఎంసీ వేగం పెంచింది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో గుత్తేదారులు పనులు ఆపేయగా.. కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ భరోసా ఇవ్వడంతో నెలరోజులుగా పనులు ఊపందుకున్నాయి.

Published : 28 Apr 2024 03:00 IST

ఊపందుకున్న పూడికతీత పనులు
4 లక్షల క్యూబిక్‌ మీటర్లలో సగం పూర్తి

బల్కాపూర్‌ నాలా .. 

ఈనాడు, హైదరాబాద్‌: నాలా పూడికతీత పనుల్లో జీహెచ్‌ఎంసీ వేగం పెంచింది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో గుత్తేదారులు పనులు ఆపేయగా.. కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ భరోసా ఇవ్వడంతో నెలరోజులుగా పనులు ఊపందుకున్నాయి. అన్ని జోన్లలో కలిపి రూ.56.38కోట్లతో దాదాపు 4లక్షల క్యూబిక్‌ మీటర్ల వ్యర్థాలను వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే సగం పనులు పూర్తయినట్లు కేంద్ర కార్యాలయం వెల్లడించింది. మిగిలినవి మే నెలాఖరులోగా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేసింది.

వ్యర్థాలు వేయొద్దు

ఖైరతాబాద్‌ జోన్‌లో నాలాల చుట్టూ బస్తీలు, కాలనీలు పెరగడంతో పూడికతీత యంత్రాలు పూర్తిస్థాయిలో పనిచేయలేక పోతున్నాయి. బల్కాపూర్‌ నాలా నార్సింగిలో మొదలై హుస్సేన్‌సాగర్‌కు పెద్దఎత్తున వరదను తీసుకొస్తుంది. సుమారు 10కి.మీ పొడవైన ఈ నాలాలో వ్యర్థాలు భారీగా చేరినట్లు ఇంజినీర్లు వెల్లడించారు. బేగంపేట, పికెట్‌ నాలాల్లోనూ ఇదే పరిస్థితి. కంటోన్మెంట్‌ నుంచి  వచ్చే టన్నుల కొద్ది వ్యర్థాలు కరాచి బేకరీ వద్ద నిలుస్తున్నాయనిఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’కు తెలిపారు.

వెయ్యి కి.మీ నాలాలు

ః నగరంలో 1200 కి.మీల పొడవైనా నాలాలు ఉండగా.. పూడికతీతకు 952.71 కి.మీలు ఎంపిక చేశారు. నిధుల దుర్వినియోగం కాకుండా తీసిన వ్యర్థాలను జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డులో కుప్పలుగా పోస్తున్నామని, కొలతల ఆధారంగా గుత్తేదారులకు బిల్లులు చెల్లిస్తున్నామన్నారు.  ః 6 జోన్లలో 3.8లక్షల క్యూబిక్‌ మీటర్ల వ్యర్థాలుండగా, ఒక్క చార్మినార్‌ జోన్‌లోనే 1.4లక్షల క్యూ.మీ.లు గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని