logo

వివాహిత ఆత్మహత్యాయత్నం.. కాపాడిన కానిస్టేబుల్‌

వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. హుస్సేన్‌సాగర్‌లో దూకేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్‌, మరికొందరు

Published : 29 Apr 2024 04:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. హుస్సేన్‌సాగర్‌లో దూకేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్‌, మరికొందరు యువకులతో కలిసి ఆమెను కాపాడారు. రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఈ ఘటన జరిగింది. అత్తాపూర్‌కు చెందిన ఓ వివాహిత(33)కు ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగలేదు. ఈ విషయంలో అత్తింట్లో గొడవలు జరుగుతున్నాయి. తీవ్ర ఆవేదన చెందిన ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆదివారం మధ్యాహ్నం సచివాలయం ఎదురుగా హుస్సేన్‌సాగర్‌లో దూకేందుకు ఇనుప కంచె దాటి నీళ్లలోకి దిగేందుకు ప్రయత్నించింది. టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌ అశోక్‌ ఆమెను గమనించి హుటాహుటిన అక్కడికి చేరుకుని అమెను అడ్డుకున్నాడు. అప్పటికే నీళ్లలోకి దిగిన ఆమెను కొందరు యువకుల సాయంతో బయటకు తీసుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని