logo

కారు రూపురేఖలు మార్చి.. భయభ్రాంతులకు గురిచేస్తూ..

రూపురేఖలు మార్చిన ఓ కారుతో రహదారులపై శబ్దాలు చేస్తూ తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 29 Apr 2024 06:29 IST

స్వాధీనం చేసుకున్న కారు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: రూపురేఖలు మార్చిన ఓ కారుతో రహదారులపై శబ్దాలు చేస్తూ తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి కథనం ప్రకారం.. టోలిచౌకికి చెందిన ఎండీ అనస్‌ఆదిల్‌  ఓ కారు కొనుగోలు చేశాడు. రంగు, సైలెన్సర్‌, డోర్లు మార్చి పెద్ద శబ్దాలు చేస్తూ రోడ్లపై వేగంగా నడుపుతున్నాడు. కేబీఆర్‌ ఉద్యానవనం నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మీదుగా నీరూస్‌ కూడలి తిరిగి కేబీఆర్‌ ఉద్యానవన వరకు చక్కర్లు కొడుతున్నాడు. శనివారం అర్ధరాత్రి విధుల్లో ఉన్న జూబ్లీహిల్స్‌ అదనపు ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌ నాలుగు బృందాలు ఏర్పాటుచేసి కారును  వెంబడించి పట్టుకున్నారు. ఆదిల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని