logo

ఫలితాల్లో.. పత్తాలేని కొత్త పార్టీలు

ప్రధాన పార్టీలు మినహాయిస్తే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వేర్వేరు పార్టీల అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వడం లేదు. 1శాతం ఓట్లను పొందలేక చతికిలపడుతున్నారు.

Updated : 29 Apr 2024 05:32 IST

ఒక్క శాతం ఓట్లు తెచ్చుకోలేక చతికిల

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధాన పార్టీలు మినహాయిస్తే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వేర్వేరు పార్టీల అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వడం లేదు. 1శాతం ఓట్లను పొందలేక చతికిలపడుతున్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల స్థానాల్లో 2014, 2019 ఎన్నికల్లో దాదాపు 40 కొత్త పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. అయితే వీరంతా కనీస పోటీ కూడా ఇవ్వలేక డిపాజిట్లు కోల్పోయారు.

సికింద్రాబాద్‌లో..

  • 2019 లోక్‌సభ ఎన్నికల్లో 28 మంది పోటీ చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తర్వాతి స్థానం 1.1 శాతంతో జనసేనకు లభించింది. మరో 9 పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నా కనీస పోటీ ఇవ్వలేకపోయారు.
  • 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 31 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. భాజపా, కాంగ్రెస్‌, ఎంఐఎం, తెరాస తర్వాత వైకాపా, ఆప్‌, జై సమైక్యాంధ్రపార్టీ, ఇండియన్‌ క్రిస్టియన్‌ సెక్యులర్‌ తదితర పార్టీల అభ్యర్థులకు 1శాతం ఓట్లు కూడా రాలేదు.

మల్కాజిగిరి బరిలో..

  • 2019 లోక్‌సభ ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఫలితాల్లో కాంగ్రెస్‌, తెరాస, భాజపా తొలి మూడుస్థానాల్లో ఉండగా...సోషల్‌ జస్టిస్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, ఇండియా ప్రజా బంధుపార్టీ అభ్యర్థులకు కేవలం 0.1శాతం ఓట్లు పడ్డాయి. ప్రజాసత్తాపార్టీకి కేవలం 720 ఓట్లు వచ్చాయి.
  • 2014 ఎన్నికల్లో మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో తెదేపా, తెరాస, కాంగ్రెస్‌, లోక్‌సత్తా, వైకాపా తర్వాత ఆప్‌, జై సమైక్యాంధ్రపార్టీ, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, బీసీ భరతదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమైక్య సమితి పార్టీలు 1శాతం ఓట్లను పొందలేదు.

హైదరాబాద్‌ స్థానం నుంచి..

  • 2019 ఎన్నికల్లో ఇక్కడ 15 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఎంఐఎంకి 58.9శాతం, భాజపాకు 26.8శాతం, తెరాసకు 7.2శాతం, కాంగ్రెస్‌కు 5.7శాతం ఓట్లు పడ్డాయి. న్యూ ఇండియా పార్టీ, సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీలకు కనీసం 1శాతం ఓట్లు పడలేదు.
  • 2014 ఎన్నికల్లో 16 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఎంఐఎం, భాజపా, కాంగ్రెస్‌, తెరాస తొలి నాలుగు స్థానాల్లో ఉండగా ఆ తర్వాతి స్థానంలో 2.2శాతం ఓట్లతో పిరమిడ్‌ పార్టీ, 1.1శాతంతో వైఎస్సార్సీపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ 0.6శాతం ఓట్లు సాధించాయి.

చేవెళ్ల.. ఇలా..

  • 2019 లోక్‌సభ ఎన్నికల్లో 23 మంది అభ్యర్థులు బరిలో ఉండగా... తెరాస, కాంగ్రెస్‌, భాజపా తొలి మూడు స్థానాలు సాధించాయి. మార్క్సిస్ట్‌ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (యునైటెడ్‌)కి 0.5శాతం, బహుజన్‌ సమాజ్‌ పార్టీకి 0.4శాతం, ప్రజా స్వరాజ్‌ పార్టీకి 0.3శాతం, నేషనల్‌ ఉమెన్స్‌ పార్టీ 0.2శాతం ఓట్లు వచ్చాయి.
  • 2014 ఎన్నికల్లో మొత్తం 16 మంది అభ్యర్థులు బరిలో ఉండగా తెరాస, కాంగ్రెస్‌, తెదేపా తొలిమూడు స్థానాల్లో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో అఖిల భారతీయ ముస్లిం లీగ్‌ (సెక్యులర్‌), వైఎస్సార్సీపీ ఉన్నాయి. మిగిలిన పార్టీలు కనీసం 1 శాతం ఓట్లను పొందలేకపోయాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని