logo

ఓటు మన ప్రాథమిక హక్కు

ఓటుని వినియోగించుకోవడం మన ప్రాథమిక హక్కని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మాధవీదేవి అన్నారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ ఉద్యానవనం వద్ద ఆదివారం ఉదయం

Published : 29 Apr 2024 04:46 IST

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మాధవీదేవి

జస్టిస్‌ మాధవీదేవికి గాంధీ విగ్రహాన్ని బహూకరిస్తున్న భూపాల్‌రెడ్డి, విశ్రాంత అధికారులు

ఓటుని వినియోగించుకోవడం మన ప్రాథమిక హక్కని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మాధవీదేవి అన్నారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ ఉద్యానవనం వద్ద ఆదివారం ఉదయం మహాత్మగాంధీ గుడి, స్వీప్‌ ఎన్నికల కమిషన్‌ సంయుక్తంగా నిర్వహించిన ఓటు అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఓటు శాతం పెరగాలన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలన్నారు. ఈ సందర్భంగా ఓటుపై అవగాహన కల్పిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో గాంధీ గుడి ఛైర్మన్‌ భూపాల్‌రెడ్డి, విశ్రాంత ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌, ఐఎస్‌ఎఫ్‌ అధికారులు దుర్గాప్రసాద్‌, మాలకొండయ్య, రాంపుల్లారెడ్డి, పీవీ రావు, మంగబాబు, హరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని