logo

గుజరాతీ.. సందడి మస్తీ

అయిదు నెలలుగా రాష్ట్రంలో అట్టహాసంగా సాగిన గుజరాతీ ఏక్తా మహోత్సవ్‌ ఘనంగా ముగిసింది. శంషాబాద్‌ మున్సిపల్‌ పరిధి సాతంరాయిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం రాత్రి నిర్వహించిన మిస్‌ గుజరాతీ, తెలంగాణ-2024 పోటీలు అలరించాయి.

Published : 30 Apr 2024 02:04 IST

యిదు నెలలుగా రాష్ట్రంలో అట్టహాసంగా సాగిన గుజరాతీ ఏక్తా మహోత్సవ్‌ ఘనంగా ముగిసింది. శంషాబాద్‌ మున్సిపల్‌ పరిధి సాతంరాయిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం రాత్రి నిర్వహించిన మిస్‌ గుజరాతీ, తెలంగాణ-2024 పోటీలు అలరించాయి. తెలంగాణ, గుజరాతీ సమాజ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు, సాంస్కృతిక, నృత్యాలు, ఫ్యాషన్‌ పోటీల్లో ప్రతిభ కనబర్చిన యువతకు ఈ సందర్భంగా పురస్కారాలు ప్రదానం చేశారు. అనంతరం తెలంగాణ, గుజరాతీ సమాజ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమల్‌ ఫరేఖ్‌ మాట్లాడుతూ.. గుజరాతీ సంస్కృతి, సంప్రదాయాలను దేశంలోని అన్ని రాష్ట్రాలకు పరిచయం చేయడమే తమ లక్ష్యమన్నారు. డిసెంబరులో ప్రారంభించిన గుజరాత్‌ ఏక్తా మహోత్సవ్‌లో 6 వేల మంది యువతీయువకులు పాల్గొన్నారని తెలిపారు.

న్యూస్‌టుడే, శంషాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని