logo

విద్యుత్తుకు రికార్డు డిమాండ్‌

గ్రేటర్‌లో విద్యుత్తు డిమాండ్‌ రికార్డు స్థాయిలో నమోదవుతోంది. 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కరెంట్‌ వాడకం విపరీతంగా పెరిగింది. సోమవారం గరిష్ఠ డిమాండ్‌ 4133 మెగావాట్లకు చేరింది.

Published : 30 Apr 2024 02:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో విద్యుత్తు డిమాండ్‌ రికార్డు స్థాయిలో నమోదవుతోంది. 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కరెంట్‌ వాడకం విపరీతంగా పెరిగింది. సోమవారం గరిష్ఠ డిమాండ్‌ 4133 మెగావాట్లకు చేరింది. గత ఏడాది ఏప్రిల్‌ 29న గరిష్ఠ డిమాండ్‌ 3109 మెగావాట్లు మాత్రమే. డిమాండ్‌ పెరుగుతున్నా నిరంతరాయ విద్యుత్తు సరఫరా చేస్తున్నామని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ అంటోంది. కరెంట్‌ కోతలపై ఎక్స్‌లో కొందరు తప్పుడు పోస్టులు పెడుతున్నారని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామంటున్నారు.  

సెలవు రోజుల్లోనూ తగ్గలేదు.. వినియోగంపరంగా సాధారణ రోజులతో పోలిస్తే వారాంతాల్లో తక్కువగా ఉంటుంది. ఈ వేసవిలో వినియోగం తీరుతెన్నులు చూస్తే అలాంటి తేడా కన్పించడం లేదు.  ఆదివారం వినియోగం 83.04 మిలియన్‌ యూనిట్లు నమోదైంది. గత ఏడాది ఏప్రిల్‌ చివరి ఆదివారం 30న చూస్తే 54.09 మిలియన్‌ యూనిట్లుగా ఉంది. డిమాండ్‌ పెరుగుతుండటంతో నెట్‌వర్క్‌పై ఓవర్‌లోడ్‌ భారం పడుతోందని ఇంజినీర్లు అంటున్నారు. లోడ్‌ విభజనతో పనులు చేసి సర్దుబాటు చేసేందుకు ఎల్‌సీ తీసుకుని పనులు చేస్తున్నామని ఇంజినీర్లు అంటున్నారు. ఇక్కడే వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వినియోగదారులకు సమాచారం ఇవ్వకుండా ఎండవేళ కరెంట్‌ తీసి మరమ్మతులు అంటే ఉపేక్షించేది లేదని డిస్కం మరోసారి అధికారులు, సిబ్బందిని హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని