logo

కిలోమీటరున్నర పనులు.. నాలుగు నెలలు

నగరంలో వానాకాలం ప్రారంభం నాటికే రహదారులు, భూగర్భ తవ్వకాల పనులు పూర్తి చేయాలి. లేదంటే వరదలతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది.

Updated : 20 May 2024 04:05 IST

45 రోజుల్లో పూర్తి చేస్తామంటూ.. ప్రమాదకరంగా తవ్వకాలు

మెహిదీపట్నంలో కొనసాగుతున్న భూగర్భ కేబుల్‌ పనులు 

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో వానాకాలం ప్రారంభం నాటికే రహదారులు, భూగర్భ తవ్వకాల పనులు పూర్తి చేయాలి. లేదంటే వరదలతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. కిలోమీటరున్నర భూగర్భ కేబుళ్లు వేసేందుకు 45 రోజులకు జనవరిలో అనుమతి తీసుకున్న ట్రాన్స్‌కో నాలుగు నెలలు అవుతున్నా పూర్తి చేయలేదు. కేబుల్‌ పర్చడం పూర్తయినా అతుకుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో మెహిదీపట్నం ప్రధాన రహదారిలో గుంతలతో ట్రాఫిక్‌ సమస్య తప్పడం లేదు.  

సీతారాంబాగ్‌లో రూ.80 కోట్లతో..

సీతారాంబాగ్‌లో రూ.80 కోట్ల వ్యయంతో గతేడాది నూతనంగా 132 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం నిర్మించారు. ఇది అందుబాటులోకి వస్తే ఇమ్లీబన్, శివరాంపల్లి ఉపకేంద్రాలపై లోడ్‌ తగ్గుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ ఉపకేంద్రం వరకు ఆసిఫ్‌నగర్‌ నుంచి భూగర్భ కేబుళ్లు వేసేందుకు ఈ ఏడాది జనవరిలో జీహెచ్‌ఎంసీ నుంచి ట్రాన్స్‌కో అనుమతి తీసుకుంది. 45 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పింది. పనుల్లో భాగంగా మెహిదీపట్నం బస్టాప్‌ ప్రాంతంలో రహదారిని అడ్డంగా తవ్వి భూగర్భ కేబుల్‌ వేశారు. వర్షాలకు రోడ్డు కుంగి ప్రమాదకరంగా మారింది. దీన్ని సరి చేయాల్సి ఉంది. రహదారికి రెండోవైపు కేబుల్‌ వేసిన చోట ఇటీవల రహదారి మరమ్మతులు చేస్తున్నారు. ఎటొచ్చి కేబుల్‌ జాయింట్‌ పనులే పూర్తికావడం లేదు. ఇక్కడే ప్రమాదకరంగా గుంతలు ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని