logo

దారులన్నీ కొండగట్టుకే

తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు.

Updated : 23 Apr 2024 05:49 IST

నేడు హనుమాన్‌ చిన్న జయంతి

కల్యాణకట్ట భవనం వద్ద దీక్షాపరులు  

న్యూస్‌టుడే, మల్యాల: తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం నుంచి హనుమాన్‌ చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం జయంతి కావడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వేలాదిగా తరలివస్తున్న దీక్షాపరులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. సోమవారం ఉదయం నుంచి అధిక సంఖ్యలో దీక్షాపరులు తరలివచ్చి మాల విరమణ తర్వాత అంజన్నకు ముడుపుకట్టి దర్శించుకుని వెళ్లారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తనుండటంతో ఆలయ అధికారులు, పోలీసు సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

ఆలయంలో కొలువైన స్వామివారు

  • దీక్షాపరుల కోసం దాతలు ప్రధాన రహదారుల పక్కన, కొండపైన ఉచితంగా అరటిపండ్లు, శుద్ధజలంతోపాటు భోజనం అందజేశారు.
  • వేములవాడ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండగట్టు స్టేజి నుంచి దొంగలమర్రి, జేఎన్టీయూ మీదుగా కొండపైకి ఉచిత బస్సు సౌకర్యాన్ని  ఈవో చంద్రశేఖర్‌ ప్రారంభించారు.
  • ఘాట్‌రోడ్డు పక్కన ఆలయ అధికారులు చలివేంద్రాల కోసం తడికల పందిళ్లు ఏర్పాటు చేసినా అందులో నీళ్లు, సిబ్బంది కనిపించకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని