logo

కాంగ్రెస్‌ వారు చెంబు లీజ్‌కు తీసుకున్నారా?

బళ్లారి నగరంలో జరిగిన బహిరంగ సమావేశంలో రాహుల్‌గాంధీ హస్తం గుర్తు గురించి మాట్లాడలేదు. ఖాళీ చెంబు గురించే మాట్లాడారు.

Published : 28 Apr 2024 04:44 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే సురేష్‌కుమార్‌, చిత్రంలో పార్టీ నేతలు

బళ్లారి : బళ్లారి నగరంలో జరిగిన బహిరంగ సమావేశంలో రాహుల్‌గాంధీ హస్తం గుర్తు గురించి మాట్లాడలేదు. ఖాళీ చెంబు గురించే మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ వారు హస్తం గుర్తుకు బదులుగా చెంబు గుర్తును లీజ్‌కు తీసుకున్నారా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సురేశ్‌కుమార్‌ తీవ్రంగా విమర్శించారు. నగరంలో న్యాయవ్యాదులతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన సురేష్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు గడిచింది. అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయలేదు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని విమర్శించారు. రైతులకు ఇవ్వాల్సిన రూ.4వేలు నిలిపివేసి రైతు వ్యతిరేక పార్టీగా మారిందన్నారు. బస్సు, విద్యుత్తు ఛార్జీలు పెంచిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ ఖాళీ చెంబు ఇచ్చారని విమర్శించారు. అనంతరం ఓ ప్రైవేట్‌ హోటల్‌ న్యాయవాదుల సంఘం సభ్యులు, మాజీ సభ్యులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించి దేశ రక్షణకు భాజపాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. భాజపా జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ మోకా, న్యాయవాది సిద్ధారెడ్డి పాటీల్‌, వసంతకుమార్‌, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, డా.మహిపాల్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని