logo

కాంగ్రెస్‌ పార్టీ పేదల పక్షం

పేదలు, కార్మికులు, రైతులు, మహిళలు, కూలీలు, విద్యార్థులకు అండగా నిలిచిన కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించాలని డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్‌ కోరారు.

Published : 28 Apr 2024 04:51 IST

ప్రచార రథంపై మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్‌, చిత్రంలో ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి,
బుడా అధ్యక్షుడు జె.ఎస్‌.ఆంజనేయులు, కార్పొరేటర్‌ ముల్లంగి నందీష్‌

బళ్లారి, న్యూస్‌టుడే: పేదలు, కార్మికులు, రైతులు, మహిళలు, కూలీలు, విద్యార్థులకు అండగా నిలిచిన కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించాలని డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్‌ కోరారు. లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి ఇ.తుకారామ్‌ తరఫున శనివారం సాయంత్రం నగర పాలికె వ్యాప్తిలోని 17వ వార్డు విశాల్‌నగర్‌, హనుమాన్‌నగర్‌, 18వ వార్డు వెంకటేశ్వరనగర, పటేల్‌నగర్‌, జనతా కాలనీ, బిసిలహళ్లి తదితర ప్రాంతాల్లో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మాట్లాడారు. విధానసభ ఎన్నికల ముందు ప్రకటించిన ఐదు గ్యారంటీలను అమలు చేసి పేదల పక్షాన నిలిచినట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 25 గ్యారంటీలను ప్రకటించింది. ఇదే తరహాలో వాటిని అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఇ.తుకారామ్‌ సౌమ్యుడు, విద్యావంతుడు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి నగరాభివృధ్ధిపై, పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. బుడా అధ్యక్షులు జె.ఎస్‌.ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని