logo

కారటగిలో రెండు ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలు

ఓటర్లను పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఆకర్షించేందుకు కారటగి పట్టణంలోని రెండు పోలింగ్‌ కేంద్రాలను అధికారులు మాదిరి పోలింగ్‌ కేంద్రాలుగా తీర్చిదిద్దారు.

Published : 28 Apr 2024 04:53 IST

కారటగి ప్రభుత్వ బాలికల పాఠశాలలోని 110వ నంబరు ఆదర్శ పోలింగ్‌ కేంద్రం

కారటగి, న్యూస్‌టుడే: ఓటర్లను పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఆకర్షించేందుకు కారటగి పట్టణంలోని రెండు పోలింగ్‌ కేంద్రాలను అధికారులు మాదిరి పోలింగ్‌ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. స్థానిక పురసభ పరిధి ప్రభుత్వ బాలికల ప్రాథమికోన్నత పాఠశాలలోని 110, 111వ పోలింగ్‌ కేంద్రాలను అందంగా అలంకరించారు. 110వ కేంద్రాన్ని ఆదర్శ కేంద్రంగా, 111వ కేంద్రాన్ని సఖీ కేంద్రంగా ముస్తాబు చేశారు. పురసభ పరిధిలో మొత్తం 25 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు రెండు కేంద్రాలను అందంగా అలంకరించామని పురసభ ముఖ్యాధికారి సురేశ్‌ తెలిపారు.

కారటగిలో 111వ నంబరు సఖీ పోలింగ్‌ కేంద్రం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని