logo

హాసనలో లైంగిక దౌర్జన్యాలపై సిట్‌

హాసన జిల్లాలో ఓ పార్టీకి చెందిన యువ నాయకుడు యువతులు, మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులు వచ్చాయి.

Published : 28 Apr 2024 04:57 IST

హాసన, న్యూస్‌టుడే : హాసన జిల్లాలో ఓ పార్టీకి చెందిన యువ నాయకుడు యువతులు, మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులు వచ్చాయి. యువతులపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన వీడియోలు తీసుకుని అవసరమైన సమయంలో శారీరక అవసరాలను తీర్చుకుంటున్నారని తమకు ఫిర్యాదులు అందాయని రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు నాగలక్ష్మి చౌదరి తెలిపారు. దర్యాప్తు వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశానని ఆమె తెలిపారు. ఆమె లేఖ నేపథ్యంలోనే ప్రత్యేక తనిఖీ దళం (సిట్‌) ఏర్పాటు చేస్తూ ఉన్నతాధికారులు శనివారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. అశ్లీల చిత్రాలు, వీడియోలను పెన్‌ డ్రైవ్‌లలో ఉంచి విక్రయిస్తున్నారని, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కొద్ది నెలల కిందట ప్రదర్శించిన పెన్‌డ్రైవ్‌లో అటువంటి వీడియోలే ఉండి ఉంటాయని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని