logo

అబద్ధాలను విశ్వసించవద్దు : సిద్ధు

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి యజమానురాలి ఖాతాకు ఏటా రూ.ఒక లక్ష జమ చేస్తామని, రైతుల రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీనిచ్చారు.

Published : 29 Apr 2024 01:04 IST

వేదికపై సిద్ధరామయ్య తదితరులను పెద్ద హారంతో సత్కరిస్తున్న స్థానికులు

బెళగావి, న్యూస్‌టుడే:  కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి యజమానురాలి ఖాతాకు ఏటా రూ.ఒక లక్ష జమ చేస్తామని, రైతుల రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీనిచ్చారు. తాళి, చేతి గాజులు అంటూ అబద్ధాలు చెబుతూ ప్రధానమంత్రి హోదాను నరేంద్రమోదీ అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు. తాను చెబుతోంది అబద్ధమని తెలిసీ మాట్లాడుతున్న ఆయనకు సిగ్గనేదే లేదని దుయ్యబట్టారు. కిత్తూరు రాణి చెన్నమ్మ జయంతిని మొదట ఆచరించింది తన ప్రభుత్వంలో అయినప్పటికీ..

భాజపా నేత బసవరాజ బొమ్మై అబద్ధాలు చెప్పుకొంటున్నారని ఆరోపించారు. చిక్కోడి లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రియాంక జార్ఖిహొళి తరఫున ఆదివారం నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. భాజపా అనగానే ఆ పార్టీ నేతలు చెప్పిన అబద్ధాలే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వస్తాయన్నారు. ఉద్యోగాలు ఇస్తామంటూ పకోడీలు వేసుకోమని సూచించడం వారికే చెల్లిందన్నారు. కులమతాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ ఇంకెన్నాళ్లు వంచిస్తారని ప్రశ్నించారు. భారతీయుల జీవితాలను మెరుగుపరచే అంశాలను కాంగ్రెస్‌ మాట్లాడుతూ ఉంటే.. జనం భావోద్వేగాలతో భాజపా ఆటలాడుతోందని దుయ్యబట్టారు. ప్రియాంక జార్ఖిహొళి, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, మంత్రులు సతీశ్‌ జార్ఖిహొళి, భైరతి సురేశ్‌, మాజీ మంత్రి వినయ్‌ కులకర్ణి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని